కలం, వెబ్ డెస్క్: తెలంగాణ ప్రభుత్వం తీసుకొచ్చిన యూరియా యాప్‌తో రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని కేసీఆర్ (KCR) తీవ్ర స్థాయిలో విమర్శించారు. యూరియా యాప్ తో రైతుల కాళ్లకు వాపులు వస్తున్నాయని మండిపడ్డారు. దుకాణంలో యూరియా లేకపోతే రైతులకు ఎక్కడి నుంచి బస్తాలు వస్తాయని ప్రశ్నించారు. గతంలో తెలంగాణ ప్రభుత్వంలో చాలా సులభంగా యూరియా బస్తాలు వచ్చేవని పేర్కొన్నారు. కాంగ్రెస్ పాలనలో రైతు బంధు కూడా సకాలంలో పడటం లేదని పేర్కొన్నారు. మేం అధికారంలో ఉన్నప్పుడు మొత్తం రైతు బంధు పైసలు 10 రోజుల్లో రైతుల ఖాతాలో వేసేవాళ్లమని.. కానీ ఇప్పుడు నెలకో ఎకరానికి చొప్పున ఇన్‌స్టాల్‌మెంట్ పద్ధతిలో వేస్తున్నారని ఫైర్ అయ్యారు.
పడిపోయిన భూముల ధరలు
తెలంగాణ రాష్ట్రంలో భూముల ధరలు విపరీతంగా పడిపోయాయని కేసీఆర్ (KCR) ఫైర్ అయ్యారు. గతంలో రోడ్డు పక్కన ఉన్న భూములు కోట్ల రూపాయలు పలికేవని.. కానీ ఇప్పుడు మాత్రం అమ్మేవాడు ఉన్నాడు కానీ.. కొనేవాడు లేడని పేర్కొన్నారు. భూముల ధరలు ఎందుకు పడిపోయాయని ప్రశ్నించారు. తెలంగాణ రాష్ట్రంలో మొత్తం స్కాములే కనిపిస్తున్నాయని మండిపడ్డారు. రెండున్నరేండ్లు గడిచినా ‘కాకికి పెడదామంటే కంకెడు లేవు.. పిట్టకు పెడదామంటే పిడికెడు లేవు’ అంటూ కేసీఆర్ ఫైర్ అయ్యారు.
Read Also : తెలంగాణను వ్యతిరేకిస్తే.. మూల్యం చెల్లించాల్సిందేనా?
Follow Us On : WhatsApp

