కలం, వెబ్ డెస్క్: ఎవరెన్ని ప్రయత్నాలు చేసినా.. తెలంగాణలో రాబోయేది బీఆర్ఎస్ ప్రభుత్వమేనని బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ (KCR) అన్నారు. బీఆర్ఎస్ పాలనలో రూ.72 వేల కోట్ల రైతు బంధు వేశామని.. కానీ, కాంగ్రెస్ ప్రభుత్వంలో ఎప్పుడు ఇస్తారో తెలియడం లేదన్నారు. జగిత్యాలలో తాను సభ పెడితే రెండో విడత ఇచ్చారని.. మూడోసారి ఇవ్వాలంటే, మరో సభ పెట్టాలేమో అని ఛలోక్తి విసిరారు. తమ హయాంలో ఒక్కో ఎకరం రూ.2 కోట్ల నుంచి రూ.3 కోట్ల వరకు ఉండేదని.. ఇప్పుడు అమ్ముదామన్నా కొనేవారు లేరని వివరించారు. ఏ రైతును పలకరించినా.. తప్పు జరిగిందని బాధపడుతున్నారని తెలిపారు. ఉద్యోగులకు తాము 72 శాతం పీఆర్సీ ఇస్తే.. ఇప్పుడు 7 శాతం కూడా ఇవ్వలేదని విమర్శించారు. కాంగ్రెస్ పాలనలో సింగరేణి, సివిల్ సప్లైలో స్కాం.. మంత్రుల భూ కబ్జాలు, దందాలు జరుగుతున్నాయని కేసీఆర్ ఆరోపించారు. రాష్ట్రాన్ని దోచుకుంటున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.
Read Also: తోడేలు గుండెలు అదరాలి.. కేసీఆర్ పై సీఎం రేవంత్ కామెంట్స్
Follow Us On: X(Twitter)

