కలం, వెబ్ డెస్క్ : తెలంగాణ రైతులకు శుభవార్త. కాళేశ్వరం పర్యటనలో భాగంగా సీఎం రేవంత్ రెడ్డి రైతు భరోసా (Rythu Bharosa) నిధులను విడుదల చేశారు. కాటారం మండలం నస్తురపల్లిలో నిర్వహించిన బహిరంగ సభలో పాల్గొన్న సీఎం రేవంత్ రెడ్డి రెండో విడత రైతు భరోసా నిధులను విడుదల చేశారు. ఈ మేరకు ఆయన రెండో విడతలో రెండు ఎకరాల వరకు భూమి ఉన్న 45,11,947 మంది రైతులకు రూ. 2,206 కోట్లను రిలీజ్ చేశారు. దీంతో రైతులు హర్షం వ్యక్తం చేశారు.
కాగా, రైతు భరోసా స్కీమ్ కింద రాష్ట్ర ప్రభుత్వం ప్రతీయేటా రెండు విడతల్లో ఎకరాకు రూ.6 వేల చొప్పున మొత్తం ఏడాదికి రూ.12 వేలను రైతుల బ్యాంక్ ఖాతాల్లో జమ చేస్తోంది. రైతు భరోసా పథకంలో భాగంగా ఇప్పటికే రబీ సీజన్లో పంట సాగుకు సంబంధించి ఎకరం, అంతకన్నా తక్కువ భూమి కలిగిన రైతుల బ్యాంక్ ఖాతాల్లో ప్రభుత్వం తొలి విడతలో భాగంగా డబ్బులు జమ చేసింది. ఇవాళ రెండో విడత డబ్బులను రిలీజ్ చేసింది. ఇక మూడో విడత చెల్లింపులను ఈ నెలాఖరులోగా పూర్తి చేస్తామని సీఎం రేవంత్ రెడ్డి ఇప్పటికే ప్రకటించారు. అయితే, మూడో విడతలో మరో ఎకరానికి ఇస్తారా?.. ఐదెకరాల వరకు పూర్తి చేస్తారా? అనేది తెలియాల్సి ఉంది.
Read Also: యూరియా యాప్‌తో రైతుల కాళ్లకు వాపులు: కేసీఆర్
Follow Us On : WhatsApp

