కలం, వెబ్ డెస్క్ : జగిత్యాలలో జరుగుతున్న ప్రజా ఆశీర్వాద సభలో సీఎం రేవంత్ రెడ్డి (Revanth Reddy)పై బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ (KCR) విరుచుకపడ్డారు. ‘మిషన్ భగీరథ నీళ్లు ఇవ్వకపోతే లాగులు పగిలేదాక సంపాలే.. పొద్దున లేస్తే.. కేసీఆర్ చావాలని కోరుకుంటున్నాడని.. నేను చచ్చేరకం కాదు.. మీరు వెయ్యి జన్మలు ఎత్తిన నేను చావును నా కొడకా ఏం అనుకుంటున్నావో’ అంటూ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. పిల్లి శాపాలకు చస్తామా.. అని ప్రశ్నించారు. చివరి శ్వాస ఉన్నంత వరకుఏ ప్రజల కోసం పనిచేస్తానని స్పష్టం చేశారు. పదేళ్ల పాటు కంటి రెప్ప కూడా పోకుండా కరెంట్ సరఫరా చేశామని.. 20 వేల మెగావాట్ల వరకు విద్యుత్తు సౌకర్యం కల్పించామన్నారు. మరి, కాంగ్రెస్ ప్రభుత్వానికి ఏమైందని మండిపడ్డారు.
కాంగ్రెస్ పార్టీకి ఓట్లు వేసేటప్పుడే.. వీళ్లు గెలిస్తే.. రైతు బంధుకు రాంరాం.. దళితబంధుకు జై భీం అంటారని చిలక్కు చెప్పినట్లు చెప్పానని, వినకుండా గెలిపించారని KCR పేర్కొన్నారు. తమ పాలనలో పది రోజుల పాలనలోనే రైతుబంధు వచ్చేదని.. ఇప్పుడు రెండు నెలలకు కూడా రెండు విడతలు రాలేని పరిస్థితి ఉందన్నారు. ఒక్కసారి వేయాల్సిన రైతుబంధును.. ఒక్కో ఎకరానికి వేస్తున్నారని విమర్శించారు. వేలం పాటలు పాడినట్లు.. పింఛన్లు పెంచుతామని ప్రకటించారని గుర్తు చేశారు.
రాష్ట్ర ఆదాయం దిగజారిపోయింది
కేసీఆర్ మాట్లాడుతూ.. ‘కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తరువాత చిల్లర మాటలే తప్ప, ఒక్కటంటే ఒక్కక కార్యాచరణ లేదు. యూరియా బస్తా కోసం యాప్‌లు పట్టుకొని తిరుగుతున్నారు. యాప్‌లు పట్టుకొని తిరిగితే కాళ్లకి వాపులు వస్తున్నాయి. బీఆర్ఎస్ హయాంలో ఆటో అతనికి ఫోన్ చేస్తే ఎన్ని అంటే యూరియా బస్తాలు తెచ్చి ఇంట్లో వేస్తుండే. బీఆర్ఎస్ హయంలో రూ.75 వేల కోట్లు రైతుల కోసం ఖర్చు చేశాము. రాష్ట్ర ఆదాయం దిగజారిపోయింది. కేసీఆర్ ఉన్నప్పుడు రియల్ ఎస్టేట్ అద్భుతంగా ఉండేది. ఈరోజు భూమి అమ్మేవాడు ఉన్నడు, కానీ కొనేవాడే దిక్కులేదు. మంచి నీళ్ల కోసం గోసపడే పరిస్థితి వచ్చింది, మక్కలు కొనే పరిస్థితి లేదు. పంట వేసిన దగ్గర నుంచి కొనేవరకు బీఆర్ఎస్ రైతులకు అండగా నిలబడింది. చేనేత కార్మికులు అవస్థ పడుతున్నారు. బీఆర్ఎస్ హయాంలో ఉద్యోగులను ఇవ్వాల్సిన PRC ఇచ్చాము. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తరువాత రిటైర్డ్, ఉద్యోగులకు ఇవ్వాల్సిన బకాయిలు ఇవ్వలేక పోతున్నారు’ అని ఫైర్ అయ్యారు.
Read Also: ఎన్టీఆర్ ను వెన్నుపోటు పొడిచిన జీవన్ రెడ్డి : సీఎం రేవంత్ రెడ్డి
Follow Us On : WhatsApp

