ఎన్టీఆర్​ ను వెన్నుపోటు పొడిచిన జీవన్ రెడ్డి : సీఎం రేవంత్ రెడ్డి

కలం, వెబ్​ డెస్క్ : సీఎం రేవంత్​ రెడ్డి (CM Revanth Reddy) మాజీ మంత్రి జీవన్​ రెడ్డిపై తీవ్ర వ్యాఖ్యలు చేశారు. నస్తూర్​ పల్లిలో జరిగిన రైతు భరోసా సభలో రేవంత్​ మాట్లాడారు. ఈ సందర్భంగా కాంగ్రెస్ నుంచి బీఆర్​ఎస్​ లో చేరిన జీవన్​ రెడ్డిపై తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డ రేవంత్​ రెడ్డి. జీవన్​ రెడ్డిని పెద్దమనిషి అని ఎందుకు పిలవాలని.. ఆ అర్హత కోల్పోయాడన్నారు. జీవన్​ రెడ్డికి రాజకీయ బీక్ష పెట్టి మంత్రి పదవి ఇచ్చిన ఎన్టీఆర్​ కు వెన్నుపోటు పొడిచారని తీవ్ర ఆరోపణలు చేశారు. టీడీపీని వీడి నాదేండ్ల భాస్కర్​ రావుతో చేరి మోసం చేశాడని.. తరువాత కాంగ్రెస్ పార్టీలో చేరాడని విమర్శించారు. 40 ఏళ్ల రాజకీయ పదవి కోసం జగిత్యాల కాంగ్రెస్​ పార్టీ కార్యకర్తలు ఊడిగం చేశారని ఆరోపించారు. అలాంటి నాయకుడికి 14 సార్లు బీఫామ్​ ఇమన్నారు. పార్టీ కార్యకర్తలు ఆయన వెనుక నిలబడి గుండెల మీద మోస్తే.. వాళ్ల గుండెలపై తన్నాడని రేవంత్​ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు.

Read Also: యూరియా యాప్‌తో రైతుల కాళ్లకు వాపులు: కేసీఆర్

Follow Us On : WhatsApp

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>