Mobile Popup Ad
Mobile Popup Ad

హరీశ్ రావు ఢిల్లీ పర్యటనపై రేవంత్ రియాక్షన్

కలం, వెబ్ డెస్క్: మాజీ మంత్రి హరీశ్ రావు విమర్శలపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి (CM Revanth Reddy)  తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. హరీశ్ రావు రహస్య ఢిల్లీ పర్యటనలో ఎవరెవరిని కలిశారో, ఆర్‌ఎస్‌ఎస్‌కు చెందిన ఏ ప్రముఖుల ద్వారా ప్రభుత్వంపై ఒత్తిడి తెచ్చేందుకు ప్రయత్నించారో తన వద్ద సమాచారం ఉందన్నారు. ఆయన అంగీకరిస్తే ప్రాజెక్టులపై పూర్తి స్థాయి విచారణకు ఆదేశిస్తానని సీఎం సవాల్ విసిరారు.

సాగునీటి ప్రాజెక్టుల విషయంలో బీఆర్‌ఎస్ అబద్ధాలు ప్రచారం చేస్తోందని రేవంత్ రెడ్డి మండిపడ్డారు. హరీశ్ రావు (Harish Rao) రాజకీయాల్లోకి రాకముందే కాంగ్రెస్ పార్టీ శ్రీపాద ఎల్లంపల్లి ప్రాజెక్టును నిర్మించిందని గుర్తుచేశారు. నేడు తెలంగాణలో వరి సాగు రికార్డు స్థాయిలో జరుగుతోందంటే అది ఎస్సార్ఎస్పీ, ఎల్లంపల్లి ప్రాజెక్టుల పుణ్యమేనన్నారు. తామే ప్రాజెక్టులన్నీ కట్టామని చెప్పుకోవడం హరీశ్ రావు హాస్యాస్పదమని ఎద్దేవా చేశారు.

Read Also: యూరియా యాప్‌తో రైతుల కాళ్లకు వాపులు: కేసీఆర్

Follow Us On: X(Twitter)

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>