కలం, వెబ్ డెస్క్: కేసీఆర్ (KCR) మీడియా సమావేశంలో ప్రముఖ జర్నలిస్ట్ రాహుల్ (Journalist Rahul) ప్రత్యేక ఆకర్షణ. కేసీఆర్ సమావేశం నిర్వహించిన ప్రతి సారి రాహుల్ ప్రస్తావన కచ్చితంగా వస్తుంది. ఇక రాహుల్ ప్రశ్నలు కూడా సూటిగా స్పష్టంగా ఉంటాయి. అయితే ఈ సారి మీడియా సమావేశంలో కేసీఆర్ విలేకరుల ప్రశ్నలకు సమాధానం చెప్పలేదు. ప్రశ్నలు ఏవీ అడగొద్దని సున్నితంగా తిరస్కరించారు. తాను ఇక రేపటి నుంచి నిత్యం ప్రజాక్షేత్రంలోనే ఉంటానని కేసీఆర్ పేర్కొన్నారు.
కేసీఆర్ ను విలేకరులు పలు అంశాల మీద ప్రశ్నించేందుకు సిద్ధమయ్యారు. ముఖ్యంగా కవిత అంశం మీద KCR ఇరుకున పడే అవకాశం ఉందని అంతా భావించారు. కానీ కేసీఆర్ మాత్రం తెలివిగా విలేఖరుల ప్రశ్నాగోష్టిని నిలువరించారు. ఈ క్రమంలోనే ప్రశ్నలు సంధించడానికి సిద్ధమైన జర్నలిస్టు రాహుల్ ని ఆపుతూ… ‘రాహుల్ సారీ. రేపటి నుంచి ప్రజాక్షేత్రంలోనే ఉంటా, అప్పుడు మీరు అడిగిన ప్రశ్నలకి సమాధానం చెప్తా’ అంటూ సమావేశాన్ని ముగించారు.
Read Also: ఫ్యూచర్ సిటీపై కేసీఆర్ సెటైర్స్
Follow Us On: X(Twitter)


