కలం, వెబ్ డెస్క్ : ఫ్యూచర్ సిటీ.. తొక్క సిటీ ఎవడికి కావాలంటూ బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ (KCR) ప్రభుత్వంపై సెటైర్స్ వేశారు. తెలంగాణ భవన్ లో జరుగుతున్న మీడియా సమావేశంలో మాజీ సీఎం కేసీఆర్ కాంగ్రెస్ ప్రభుత్వంపై నిప్పులు చెరిగారు. ఫార్మా సిటీ కోసం తమ ప్రభుత్వం సేకరించిన భూములను కాంగ్రెస్ ప్రభుత్వం అమ్ముకోవాలని చూస్తున్నదని తీవ్ర ఆరోపణలు చేశారు.
అసలు రాష్ట్రంలో ఏం జరుగుతోంది అంటూ ఫ్యూచర్ సిటీపై KCR స్పందించారు. 400 ఏళ్లుగా పెరిగి హైదరాబాద్ ఉన్నత నగరంగా మారిందన్నారు. భవిష్యత్తును దృష్టిలో పెట్టుకుని ఫార్మా సిటీని రూపొందించామన్నారు. కానీ, ఫార్మా సిటీని పక్కన పెట్టి ఫ్యూచర్ సిటీ పేరుతో కాంగ్రెస్ ప్రభుత్వం నాశనం పట్టిస్తుందని కేసీఆర్ దుయ్యబట్టారు. ఫార్మా సిటీ కోసం తాము సేకరించిన భూములను కాంగ్రెస్ ప్రభుత్వం అమ్ముకుంటుందని కేసీఆర్ ఆరోపించారు.
Read Also: రెండేళ్లు ఆగాము.. ఇక ఆగేది లేదు.. నేను కూడా హాజరవుతా -KCR
Follow Us On: X(Twitter)


