కలం, వెబ్ డెస్క్: Chinmayi – Shivaji | ‘దండోరా’ ప్రీ-రిలీజ్ ఈవెంట్‌లో నటుడు శివాజీ ఘాటు వ్యాఖ్యలు చేశారు. హీరోయిన్ల డ్రెస్సులపై అభ్యంతరకర వ్యాఖ్యలు చేశారు. ‘‘అందం అనేది చీరలో నిండుగా కప్పుకునే బట్టల్లోనే ఉంటుంది. సామాన్లు బయటకు కనిపించేలా ఉంటే.. ఏమీ ఉండదు’ అని మాట్లాడారు. సావిత్రి, రష్మిక మందన్న తారలను ప్రస్తావిస్తూ శివాజీ కామెంట్స్ చేశారు.
ప్రస్తుతం శివాజీ కామెంట్స్ వైరల్‌గా మారడంతో సింగర్ చిన్మయి (Chinmayi) సోషల్ మీడియా వేదికగా స్పందించారు. ‘‘శివాజీ అద్భతమైన విలన్. అబ్బాయిలకు హీరోగా మారాడు. విషయం ఏమిటంటే.. మహిళల డ్రెస్సింగ్ గురించి ఆయన మాట్లాడటం సరైంది కాదు. మహిళలందరూ చీర కట్టుకోవాలా? అయితే మీరు జీన్స్, హుడీ బదులు ధోతి కట్టుకోండి. భారత సంప్రదాయం గురించి మాట్లాడే ముందు మీరు పాటించాలి. పెళ్లయితే మెట్టెలు, కంకణం కూడా ధరించాలి‘‘ అంటూ కౌంటర్ ఇచ్చారు. చిన్మయి పోస్ట్ కొన్ని గంటల్లోనే వైరల్ కావడంతో నెటిజన్స్ రియాక్ట్ అయ్యారు. శివాజీ వ్యాఖ్యలు అనుచితమైనవి అని విమర్శించారు. సోషల్ మీడియాలో శివాజీ కామెంట్స్ వైరల్ అవుతున్నా.. ఆయన నుంచి ఎలాంటి స్పందన రాలేదు.
మురళీకాంత్ దర్శకత్వం వహించిన ‘దండోరా’ చిత్రంలో శివాజీ, నవదీప్, బిందు మాధవి, నందు నటించారు. ఈ చిత్రం సామాజిక ఇతివృత్తాల ఆధారంగా తెరకెక్కింది. డిసెంబర్ 25న విడుదల కానున్న ఈ చిత్రం ట్రైలర్ (Trailer) అందర్నీ ఆకర్షించింది. కానీ ఇప్పుడు శివాజీ కామెంట్స్‌తో వివాదాన్ని ఎదుర్కొంటోంది.
Read Also: భూమివైపు దూసుకొస్తున్న స్టార్‌లింక్ శాటిలైట్
Follow Us On: Youtube


