కలం, వెబ్ డెస్క్: బిజీ లైఫ్ కారణంగా చాలామంది అనారోగ్యం బారిన పడుతున్నారు. ముఖ్యంగా గుండె సంబంధిత (Heart failure) సమస్యలతోనూ తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. గుండె వైఫల్యానికి అనేక కారణాలున్నాయి. రాత్రిపూట పదే పదే మూత్రవిసర్జన, చీలమండలు వాపు, ఊపిరి ఆడకపోవడం లాంటి సంకేతాలు గుండె వైఫల్యానికి సంబంధించినవేనని డాక్టర్లు హెచ్చరిస్తున్నారు. వయస్సు పెరిగేవారు గుండె సమస్యల బారిన పడుతున్నారు. వరల్డ్ హార్ట్ ఫెడరేషన్ అందించిన డేటా ప్రకారం.. ప్రపంచవ్యాప్తంగా 64 మిలియన్లకుపైగా ప్రజలు హెర్ట్ ఫెయిల్యూర్ బారిన పడ్డారు.
చీలమండల వాపు (Ankles) గుండె బలహీనపడటాన్ని సూచిస్తుందని డాక్టర్లు చెబుతున్నారు. శారీరక శ్రమ చేసే సామర్థ్యం క్రమంగా తగ్గడం గుండె వైఫ్యలాన్ని తెలియజేస్తుంది. చాలామంది వెన్ను, మోకాలి సమస్యలతో బాధపడుతున్నారు. చిన్న సమస్యలే కదా నిర్లక్ష్యం చేస్తున్నారు. కానీ ఈ సమస్యలు గుండె వైఫ్యల్యానికి దారితీస్తున్నాయి.
వాపు సమస్యలతో బాధపడినట్టయితే వెంటనే డాక్టర్ల (Doctors) ను సంప్రదించాలని పలు హెల్త్ సర్వేలు చెబుతున్నాయి. అలాగే కొందరు రాత్రి సమయంలో శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది పడుతుంటారు. ఇది కూడా హార్ట్ ఫెయిల్యూర్‌కు దారితీయొచ్చు. గుండె వైఫల్యాన్ని వీలైనంత త్వరగా గుర్తిస్తే వెంటనే ప్రమాదం నుంచి బయటపడొచ్చని డాక్టర్లు చెబుతున్నారు.


