Mobile Popup Ad
Mobile Popup Ad

జీవన్ రెడ్డికి కీలక పదవి.. ప్రకటించిన కేసీఆర్

కలం, వెబ్ డెస్క్: బీఆర్ఎస్ పార్టీలో జీవన్ రెడ్డి (Jeevan Reddy) చేరికతో జగిత్యాలలో ఆయన గెలుపు ఖాయమైందని బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ (KCR) అన్నారు. ఆయన్ను వెంటనే.. పార్టీ ప్రధాన కార్యదర్శి పదవిలో నియమిస్తున్నట్లు వేదికపై నుంచి ప్రకటించారు. అన్నాదమ్ముల మాదిరి.. పార్టీ కోసం పనిచేద్దామని ఇటీవల తనను జీవన్ రెడ్డిని కలిసినప్పుడు చెప్పానని గుర్తు చేశారు. జీవన్ రెడ్డి కేవలం జగిత్యాలకే పరిమితం కాకుండా.. కరీంనగర్, నిజామాబాద్, ఆదిలాబాద్ జిల్లాల్లో కూడా పనిచేయాలని కోరారు. రాబోయే బీఆర్ఎస్ ప్రభుత్వంలో జీవన్ రెడ్డికి కీలక పదవి రాబోతుందన్నారు. జగిత్యాల యుద్ధం ఇక మీ వంతు అని.. తెలంగాణ యుద్ధం తన వంతు అని శ్రేణులను ఉత్సాహపరిచారు. రాబోయేది బీఆర్ఎస్ ప్రభుత్వమేనంటూ కుండబద్దలు కొట్టినట్లు చెప్పిన కేసీఆర్… రాష్ట్రమంతా బాధ్యతలు నిర్వర్తించే పదవి జీవన్‌రెడ్డికి వస్తుందంటూ పరోక్షంగా మంత్రిని చేస్తానని వ్యాఖ్యానించారు.

పార్టీ ప్రధాన కార్యదర్శిగా జీవన్ రెడ్డిని నియమిస్తున్నా..

కేసీఆర్ మాట్లాడుతూ.. ‘జీవన్ రెడ్డి గుండె ధైర్యం ఉన్నోడు. జీవన్ రెడ్డి గురించి ఎక్కువ చెబితే మాకు మేము డబ్బా కొట్టుకున్నట్లు ఉంటుంది. జీవన్ రెడ్డి నేను మంచి స్నేహితులం, పార్టీలు వేరైనా కలిసి పనిచేశాము. జగిత్యాల ప్రజల దీవెనలతో ఆరు పర్యాయాలు ఎమ్మెల్యేగా జీవన్ రెడ్డి గెలిచారు. ఉమ్మడి కరీంనగర్ జిల్లాల్లో జీవన్ రెడ్డికి అనేక మంది అభిమానులు ఉన్నారు. జగిత్యాల అభివృద్ధి కోసం నిరంతరం జీవన్ రెడ్డి పాటుపడేవాడు. జీవన్ రెడ్డి బీఆర్ఎస్ పార్టీలో చేరితే బీఆర్ఎస్ పార్టీకి లాభ నష్టాలపై సర్వేలు వచ్చాయి. జీవన్ రెడ్డి బీఆర్ఎస్ పార్టీలో చేరితే బీఆర్ఎస్ పార్టీకి లాభం చేకూరుతుందని సర్వేలు చెప్పాయి. ఎమ్మెల్యేగా జీవన్ రెడ్డి ఓడిపోయినా.. పట్టభద్రుల ఎమ్మెల్సీగా ఆయన్ని ఈ ప్రాంత ప్రజలు గెలిపించారు. జీవన్ రెడ్డికి పదవులు కొత్తేం కాదు. జీవన్ రెడ్డి, నేను కలిసినప్పుడు బీఆర్ఎస్ పార్టీలో కుటుంబ సభ్యులుగా అన్నాతమ్ముల్లా పనిచేద్దామని చెప్పా. ఉమ్మడి కరీంనగర్ జిల్లానే కాదు.. చుట్టుపక్కల జిల్లాలను కూడా ఆయన పర్యవేక్షించాలి. అందుకే ఈ క్షణం నుంచే పార్టీ ప్రధాన కార్యదర్శిగా జీవన్ రెడ్డిని నియమిస్తున్నా.’ అని వ్యాఖ్యానించారు.

Read Also: రైతు భరోసా నిధులు విడుదల చేసిన సీఎం రేవంత్ రెడ్డి

Follow Us On: X(Twitter)

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>