Mobile Popup Ad
Mobile Popup Ad

నాంపల్లి కోర్టుకు TRS చీఫ్‌ కవిత..

కలం, వెబ్‌ డెస్క్‌ : నాంపల్లిలోని మనోరంజన్ కాంప్లెక్స్‌లో ఉన్న రైల్వే కోర్టుకు TRS చీఫ్ కవిత (Kavitha) హాజరయ్యారు. గతంలో కామారెడ్డిలో నిర్వహించిన రైల్ రోకో ఆందోళనకు సంబంధించి నమోదైన కేసులో భాగంగా ఆమె సోమవారం న్యాయస్థానం ముందు నిలిచారు. బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు కల్పించాలనే డిమాండ్‌తో నవంబర్ 28న నిర్వహించిన నిరసన కార్యక్రమంపై రైల్వే పోలీసులు అప్పట్లో కేసు నమోదు చేశారు.

కవితతో పాటు సుమారు 12 మంది నాయకులపై ఈ అభియోగాలు ఉన్నాయి. కోర్టు జారీ చేసిన సమన్లకు స్పందిస్తూ ఆమె తన అనుచరులతో కలిసి మెజిస్ట్రేట్ ఎదుట హాజరయ్యారు. న్యాయప్రక్రియలో భాగంగా వాంగ్మూలం నమోదు చేసిన అనంతరం విచారణను న్యాయస్థానం వాయిదా వేసింది. ఈ సందర్భంగా కోర్టు పరిసరాల్లో భారీగా పోలీసులు మోహరించారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>