కవిత, వెబ్ డెస్క్: తెలంగాణ రాష్ట్రంలో కర్కోటకుడి పాలన కొనసాగుతోందని తెలంగాణ రాష్ట్ర సేన కవిత (Kavitha) వ్యాఖ్యానించారు. తెలంగాణలో ఇండ్లు కూలుస్తుంటే కేసీఆర్ ఎందుకు బయటకు రావడం లేదని ప్రశ్నించారు. తెలంగాణ రాష్ట్ర సేన ఆవిర్భావ సభలో కవిత తన తండ్రి బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ మీద సంచలన వ్యాఖ్యలు చేశారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పాలనపైనా విమర్శలు గుప్పించారు.
ఉద్యమకారులకు పదవులు ఏవి?
తెలంగాణ రాష్ట్రంలో ఉద్యమకారులకు పదవులు ఎందుకు దక్కలేదని కవిత (Kavitha) ప్రశ్నించారు. తెలంగాణ కోసం కొట్టాడిన ఉద్యమకారులను పక్కన పెట్టుకొని.. తెలంగాణ ద్రోహులకు కేసీఆర్ పదవులు ఇచ్చారని ఫైర్ అయ్యారు. కేసీఆర్ మరబొమ్మలాగా మారిపోయారని పేర్కొన్నారు. ఆయన పాత కేసీఆర్ కాదని అందుకే జనంలోకి రావడం లేదని పేర్కొన్నారు.
రెండేండ్ల తర్వాత మనదే అధికారం
రెండేండ్ల తర్వాత తెలంగాణ రాష్ట్ర సేన పార్టీ అధికారంలోకి వస్తుందని కవిత పేర్కొన్నారు. అప్పుడు ప్రజలకు న్యాయం చేస్తానన్నారు. కర్కోటడుడు తెలంగాణ రాష్ట్రాన్ని పాలిస్తున్నాడని పేర్కొన్నారు.
Read Also: ఫ్రీ ఎడ్యుకేషన్, ఫ్రీ వైద్యం: కవిత కీలక హామీలు
Follow Us On: Instagram

