Mobile Popup Ad
Mobile Popup Ad

ఫ్రీ ఎడ్యుకేషన్, ఫ్రీ వైద్యం: కవిత కీలక హామీలు

కలం, వెబ్ డెస్క్: కొత్త పార్టీ ఆవిర్భావం సందర్భంగా ప్రజలకు టీఆర్ఎస్ అధినేత్రి కవిత (TRS Chief) కీలక హామీలు ఇచ్చారు. రాష్ట్ర ప్రజలందరికీ ఫ్రీ ఎడ్యుకేషన్, ఫ్రీ వైద్యం అందిస్తామని పేర్కొన్నారు. ఆమె రాష్ట్ర ప్రజల కోసం పాంచజన్యం పూరించారు. అందులో భాగంగా ఫ్రీ ఎడ్యుకేషన్, ఫ్రీ వైద్యం అందిస్తామని భరోసా ఇచ్చారు. తెలంగాణ రాష్ట్రంలో తెలంగాణ రాష్ట్ర సేన అధికారంలోకి వస్తే ప్రజలకు ప్రైవేటు, ప్రభుత్వ బడుల్లో ఉచిత విద్య అందిస్తామని చెప్పారు. వైద్యం కూడా ఫ్రీగా అందిస్తామన్నారు. ప్రతి బడిలో ఒక టీచర్ ఉండాలని కవిత ఆకాంక్షించారు. ఏ ఆస్పత్రిలోనైనా.. ఏ రోగమైనా ఉచితంగా వైద్యం అందిస్తామన్నారు.

ఆకట్టుకున్న కవిత (Kavitha) ప్రసంగం

కవిత మొదటి సభలోనే ప్రజలను ఆకట్టుకొనేలా ప్రసంగించారు. ప్రజలను ఆకట్టుకొనేలా అనర్గళంగా తెలుగు, ఉర్దూ, ఇంగ్లిష్ భాషల్లో మాట్లాడారు. అటు బీఆర్ఎస్ అధినేత కేసీఆర్, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని విమర్శిస్తూనే పాలనపరమైన హామీలు ఇచ్చారు. తాము అధికారంలోకి వస్తే ఏమేం చేస్తామో చెప్పుకొచ్చారు. తెలంగాణ ప్రజలు ఎటువంటి కష్టాలు అనుభవిస్తున్నారో వివరించారు. తెలంగాణ రాష్ట్రసేన ఎందుకు ఆవిర్భవించిందో.. అందుకు దారితీసిన పరిస్థితులు ఏమిటో వివరించారు.

Read Also: ఆటో డ్రైవర్ల భారీ నిరసన: ఒకరు ఆత్మహత్యాయత్నం!

Follow Us On: Sharechat

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>