తెలంగాణ‌లో విఫ‌ల‌మై కేర‌ళలో హామీలా?: సీఎం రేవంత్‌పై క‌విత విమర్శలు

క‌లం, వెబ్ డెస్క్‌: సీఎం రేవంత్ రెడ్డి (CM Revanth Reddy) స‌హా రాష్ట్ర మంత్రులు కేర‌ళ (Kerala) అసెంబ్లీ ఎన్నిక‌ల ప్ర‌చారంలో పాల్గొన్న సంగ‌తి తెలిసిందే. ఈ క్ర‌మంలో సీఎం రేవంత్ కేర‌ళకి స్వ‌ర్ణ యుగం పేరుతో కాంగ్రెస్ పార్టీ గ్యారెంటీలను ఆవిష్కరించడంపై తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత (Kavitha) ఎక్స్ వేదికగా స్పందించారు. తెలంగాణలో ఇచ్చిన ఆరు గ్యారెంటీలను అమలు చేయడంలో విఫలమైన రేవంత్ రెడ్డి, పక్క రాష్ట్రాలకు వెళ్లి హామీలు ఇవ్వడం హాస్యాస్పదంగా ఉందని ఆమె విమర్శించారు.

నిజమైన నాయకత్వానికి ఒక మేనిఫెస్టో ఎంత దూరం ప్రయాణించింద‌న్నది కొల‌మానం కాద‌ని, ప్ర‌జ‌ల‌కు ఇచ్చిన‌ హామీలను ఎంత వరకు నెరవేర్చామన్నదే ముఖ్య‌మ‌ని చెప్పారు. తెలంగాణలో 2023 హామీలు ఇంకా కాగితాలపైనే ఉన్నాయ‌ని, రేవంత్ రెడ్డి ప్ర‌చారాల‌తో అంద‌రినీ మాయ చేస్తున్నాడ‌ని ఆమె (Kavitha) విమ‌ర్శించారు.

Read Also: పర్యాటకంలో కొత్త ట్రెండ్.. నిద్ర కోసమే విహారయాత్రలు!

Follow Us On: Instagram

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>