పోరాట యోధుడు దొడ్డి కొమురయ్య : కరీంనగర్​ మేయర్​

కలం, కరీంనగర్ బ్యూరో : తెలంగాణ సాయుధ పోరాట తొలి అమరుడు, స్వాతంత్ర్య సమరయోధుడు దొడ్డి కొమురయ్య అని​ నగర మేయర్ కొలగాని శ్రీనివాస్ అన్నారు. కరీంనగర్ (Karimnagar)లో దొడ్డి కొమురయ్య 99వ జయంతిని నిర్వహించారు. బీరప్ప యువజన సంఘం ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమానికి నగర మేయర్ కొలగాని శ్రీనివాస్, డిప్యూటీ మేయర్ యాదగిరి సునీల్ రావు ముఖ్య అతిథిగా హాజరై, దొడ్డి కొమురయ్య చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. అనంతరం మేయర్ కొలగాని శ్రీనివాస్, డిప్యూటీ మేయర్ యాదగిరి సునీల్ రావు మజ్జిగ పంపిణీ చేశారు.

ఈ సందర్భంగా కరీంనగర్ మేయర్ (Karimnagar Mayor) మాట్లాడుతూ.. భూమి కోసం, భుక్తి కోసం, వెట్టిచాకిరీ విముక్తి కోసం పోరాడి తెలంగాణ ప్రజల తెగువను ప్రపంచానికి చాటి చెప్పిన వీరుడు దొడ్డి కొమురయ్య అన్నారు. డిప్యూటీ మేయర్ యాదగిరి సునీల్ రావు మాట్లాడుతూ.. దొడ్డి కొమురయ్య ధైర్య సాహసాలు, పోరాట స్పూర్తి నేటి తరానికి ఆదర్శం అన్నారు. ఈ కార్యక్రమంలో కార్పొరేటర్లు కర్రె పద్మ అనిల్, ఎన్నం లక్ష్మీ ప్రకాష్, గాజ రమ శివరాం, నర్సింగ్, కురుమ సంఘం అధ్యక్షులు బండారి శేఖర్, మాజీ కార్పొరేటర్లు, కురుమ సంఘం సభ్యులు పాల్గొన్నారు.

Read Also: పర్యాటకంలో కొత్త ట్రెండ్.. నిద్ర కోసమే విహారయాత్రలు!

Follow Us On: Sharechat

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>