కలం, వెబ్ డెస్క్: ఇటీవల జాగృతి అధ్యక్షురాలు కవిత (Kavitha) కారుకు భారీ సంఖ్యలో ట్రాఫిక్ చలాన్లు పడ్డ విషయం తెలిసిందే. ‘జనం బాట’ కార్యక్రమంలో భాగంగా కవిత రాష్ట్ర వ్యాప్తంగా పర్యటిస్తున్నారు. ఆమె వాహనం (TS09EU6666)పై మొత్తం 16 ఓవర్ స్పీడింగ్/ డేంజరస్ డ్రైవింగ్ (సెక్షన్ 184) చలాన్లు నమోదయ్యాయి. ఈ నేపథ్యంలో తాజాగా కవిత తన కారును మార్చారు. ప్రస్తుతం ఆమె బెంజ్ కారుకు మారిపోయారు. శుక్రవారం ఆమె మండలి సమావేశాలకు బెంజ్ కారులో వచ్చారు. జనం బాట కార్యక్రమంలో కవిత Lexus వాహనం వాడేవారు. ఈ కారుకు భారీగా చలాన్లు పడటంతో ఆమె తాజాగా బెంజ్ కారుకు మారారు. ఇటీవల ట్రాఫిక్ పోలీసులు 16 చలాన్లు పడ్డాయి. టోటల్ రూ.15,200 ఫైన్ అమౌంట్‌తో కలిపి యూజర్ ఛార్జీలు, ఇతర ఛార్జీలతో సహా రూ.15,760కు చేరుకుంది.

Read Also: కేసీఆర్ అసెంబ్లీకి రాకపోతే బీఆర్ఎస్ ఖతమే: కవిత
Follow Us On: X(Twitter)


