కలం వెబ్ డెస్క్ : టాలీవుడ్ లో స్టార్ హీరోల సినిమాలకు ఎంతటి క్రేజ్ ఉంటుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. తమ అభిమాన హీరో సినిమా రిలీజ్ సమయంలో ఫ్యాన్స్ చేసే హంగామా అంతా ఇంతా కాదు. టాలీవుడ్ బడా సినిమాలకు రెండు తెలుగు రాష్ట్ర ప్రభుత్వాలు టికెట్ రేట్స్ పెంచుకునేందుకు అవకాశం కల్పిస్తున్న సంగతి తెలిసిందే. పుష్ప 2 (Pushpa 2) మూవీకి సంబంధించి సంధ్య థియేటర్ తొక్కిసలాట ఘటన తరువాత తెలంగాణ ప్రభుత్వం టాలీవుడ్ లో ఏ సినిమాకు టికెట్ రేట్స్ పెంచేది లేదని కీలక ప్రకటన చేసింది. కానీ ఆ తరువాత పలు చిత్రాలకు టికెట్ రేట్స్ పెంచుకునేందుకు అవకాశం కల్పించింది.
అయితే ఇటీవల టాలీవుడ్ సీనియర్ స్టార్ హీరో నందమూరి బాలకృష్ణ నటించిన అఖండ 2 చిత్రానికి టికెట్ రేట్స్ పెంచుకునేందుకు తెలంగాణ ప్రభుత్వం అవకాశం కల్పించగా ఈ విషయంపై హై కోర్టు ధర్మాసనం ఆగ్రహం వ్యక్తం చేసింది. తనకి తెలియకుండానే అఖండ 2 చిత్రానికి అధికారులు టికెట్ రేట్స్ పెంచుకునేందుకు అవకాశం కల్పించారని తెలంగాణ సినిమాటోగ్రఫీ మంత్రి కోమటిరెడ్డి తెలిపారు. ఇక నుంచి సినిమా వాళ్లు టికెట్ రేట్స్ పెంపు గురించి తమ వద్దకు రానవసరం లేదని.. టికెట్ రేట్స్ పెంచేది లేదని ఆయన స్పస్టం చేశారు. దీంతో ఈ సంక్రాంతికి రిలీజ్ కాబోయే రాజాసాబ్(Raja Saab) , మన శంకరవరప్రసాద్ గారు (Mana Shankara Vara Prasad Garu) వంటి చిత్రాలకు టికెట్ రేట్ ఎఫెక్ట్ పడనుంది.. అయితే ఈ విషయం పై తెలంగాణ ప్రభుత్వం మరోసారి పునరాలోచన చేస్తుందో లేదో చూడాలి.
Read Also: “జన నాయకుడు”పై ఆ ప్రచారం నిజమేనా ..?
Follow Us On: Sharechat


