Mobile Popup Ad
Mobile Popup Ad

మోదీకి భయపడి తెలంగాణ ఎంపీలు నోరు మూసుకున్నారు: కవిత

కలం, వెబ్ డెస్క్: దేశ్యాప్తంగా డీలిమిటేషన్‌, తేజస్వి సూర్య కామెంట్స్‌పై తీవ్ర వ్యతిరేకత వస్తున్న నేపథ్యంలో తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కవిత (Kavitha) బీజేపీని లక్ష్యంగా చేసుకొని ఘాటు వ్యాఖ్యలు చేశారు. శుక్రవారం ఆమె మీడియాతో మాట్లాడారు. తెలంగాణకు చెందిన ఎంపీలు (కాంగ్రెస్, బీజేపీ) ప్రధాని మోదీకి (PM Modi) భయపడి నోరు మూసుకొని కూర్చున్నారని మండిపడ్డారు. రాష్ట్ర ప్రయోజనాల విషయంలో వారు నోరు మెదపడం లేదని కవిత ఆరోపించారు.

బీజేపీ ఎంపీలు తెలంగాణ ప్రజలను అవమానిస్తున్నా, రాష్ట్ర హక్కులను కాలరాస్తున్నా ఇక్కడి ఎంపీలు మౌనంగా ఉండటం దారుణమని ధ్వజమెత్తారు. భవిష్యత్తులో జరగబోయే డీలిమిటేషన్‌తో దక్షిణ భారతదేశానికి ముఖ్యంగా తెలంగాణకు తీవ్ర నష్టం వాటిల్లుతుందని ఆందోళన వ్యక్తం చేశారు. జనాభా నియంత్రణ పాటించిన దక్షిణాది రాష్ట్రాలకు డీలిమిటేషన్‌ వల్ల రాజకీయ ప్రాతినిధ్యం తగ్గి అన్యాయం జరుగుతుందని కవిత స్పష్టం చేశారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>