NH‌‌‌‌‌‌‌‌–161 పై స్కార్పియో బోల్తా.. ముగ్గురు స్పాట్ డెడ్

కలం, మెదక్ బ్యూరో: సంగారెడ్డి (Sangareddy) జిల్లా కల్హేర్ మండలం బాచేపల్లి సమీపంలో జాతీయ రహదారి (NH–161) పై మంగళవారం ఉదయం ఘోర రోడ్డు ప్రమాదం (Road Accident) జరిగింది. వేగంగా వెళ్తున్న స్కార్పియో వాహనం బోల్తా పడిన ఈ దుర్ఘటనలో ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు.

నాందేడ్ – అకోలా జాతీయ రహదారి NH‌‌‌‌‌‌‌‌–161 పై ప్రయాణిస్తున్న స్కార్పియో వాహనానికి ఎదురుగా అకస్మాత్తుగా ఒక బైక్ వచ్చింది. ఆ బైక్‌ను తప్పించబోయే క్రమంలో స్కార్పియో డ్రైవర్ వాహనాన్ని అదుపు చేయలేకపోయాడు. దీంతో తీవ్ర నియంత్రణ కోల్పోయిన స్కార్పియో రహదారిపై పలు మార్లు పల్టీలు కొట్టి బోల్తా పడింది.

ఈ ప్రమాద తీవ్రతకు స్కార్పియోలో ప్రయాణిస్తున్న ముగ్గురు తీవ్ర గాయాలపాలై ఘటనా స్థలంలోనే మృతి చెందారు. మృతులు మహారాష్ట్రలోని నాందేడ్ ప్రాంతానికి చెందిన షమీన్ బేగం(48), అన్బియ టాస్కీం (4), మహ్మద్ నదీమ్ (37) గా పోలీసులు గుర్తించారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>