కలం, వెబ్ డెస్క్: భారత దేశం (India) అప్పు రూ.201 లక్షల కోట్లకు చేరినట్లు కేంద్ర ప్రభుత్వం వెల్లడించింది. 2014–15లో దేశ అప్పు రూ.64.11 లక్షల కోట్లు కాగా, గత 12 ఏళ్లలో అది రూ.137 లక్షల కోట్లకు పెరిగింది. సుమారు 214 శాతం పెరిగినట్లు కేంద్ర ఆర్థిక మంత్రిత్వ శాఖ లోక్ సభకు వెల్లడించింది. గత పదేళ్లలో రూ.125.99 లక్షల కోట్లు అప్పుగా తీసుకున్నట్లు అందులో పేర్కొంది.
ఎందుకోసం ఖర్చు చేశారంటే..!
వీటిలో రూ.60.21 లక్షల కోట్లను రోడ్లు, రైల్వేలు, రక్షణ, అణు, దేశానికి అవసరమయ్యే వివిధ రకాల భారీ ప్రాజెక్టులపై మూల ధన వ్యయంలో భాగంగా ఖర్చు చేశారు. మిగిలిన రూ.30.94 లక్షల కోట్లను పరిపాలనా ఖర్చులు, ఇతర వ్యయాల కోసం అప్పుగా సేకరించినట్లు స్పష్టం చేశారు. ఈ లెక్కన చూస్తే ప్రతి భారతీయుడిపై 1.38 లక్షల అప్పు ఉంటుందని విశ్లేషకులు చెబుతున్నారు.

