హరీష్ రావు అవినీతిపై నిగ్గు తేల్చాల్సిందే : కల్వకుంట్ల కవిత

కలం, నిజామాబాద్ బ్యూరో : మాజీ మంత్రి హరీష్ రావు అవినీతి పై నిగ్గు తేల్చాల్సిందేనని తెలంగాణ రక్షణ సేన చీఫ్ కల్వకుంట్ల కవిత (Kalvakuntla Kavitha) మరోసారి డిమాండ్ చేశారు. ఆయన చేసిన అవినీతిపై ప్రజాక్షేత్రంలో కొట్లాడటంతో పాటు చట్టపరంగా, న్యాయపరంగా ఉన్న అన్ని మార్గాల ద్వారా పోరాటం చేస్తామని చెప్పారు. సోమవారం నిజామాబాద్ జిల్లా పర్యటనలో ఉన్న ఆమె మీడియాతో మాట్లాడారు. హరీష్ రావు అవినీతికి సంబంధించి అన్ని ఆధారాలను సీబీసీఐడీకి, సెంట్రల్ విజిలెన్స్ కమిషన్ కు కూడా పంపిస్తామని చెప్పారు. తప్పు చేసిన వారెవరైనా సరే కచ్చితంగా వారికి శిక్ష పడాలన్నదే తమ విధానమన్నారు.

మోడీని కలిసి కరువు గురించి మాట్లాడరా?

ఎల్ నినో కారణంగా రాష్ట్రంలో కరువు పరిస్థితులుంటే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి (Revanth Reddy) మాత్రం అత్యంత నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని కవిత (Kavitha) మండిపడ్డారు. ప్రధాని మోడీని కలిసిన ఆయన కనీసం ఈ అంశంపై మాట్లాడకపోవటం ఆశ్చర్యం కలిగిస్తోందన్నారు. రాష్ట్రంలో కరువు, రైతుల బాధలు, పంటల పరిస్థితిని ప్రధానికి వివరించి సాయం కోరాలన్న సోయి కూడా సీఎం కు లేదన్నారు. పెండింగ్ లో ఉన్న బీసీ బిల్లు గురించి కూడా ప్రధానితో ప్రస్తావించకపోవటం అన్యాయమని ధ్వజమెత్తారు.

ప్రజలకు సంబంధించిన అంశాలను పక్కన పెట్టి కేవలం కాంట్రాక్ట్ లు, కమీషన్ల గురించి మాట్లాడుకున్నారని విమర్శించారు. రాష్ట్రంలో కరువు మండలాలను ప్రకటించాలని కోరారు. ఉమ్మడి రాష్ట్రంలో గానీ, తెలంగాణ వచ్చిన తర్వాత గానీ రైతులను పంటలు వేయవద్దని చెప్పిన ఏకైక ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డే అని చెప్పారు. పంటలు వేయకపోతే రైతులకు ఏం పరిహారం ఇస్తారో చెప్పాలన్నారు. ఎకరాకు రూ. 25 వేలు పరిహారం ఇవ్వాల్సిందేనని డిమాండ్ చేశారు.

త్వరలోనే రాష్ట్ర వ్యాప్తంగా బైరవ వాహనంలో యాత్ర

తమ పార్టీ ప్రజలకు ఉచిత విద్య, వైద్యం అందాలన్న సంకల్పంతో ఉందని, అదే విధంగా సామాజిక న్యాయం ప్రతి వర్గానికి అందాలన్నదే తమ అభిమతమని చెప్పారు. పాంచజన్య సంకల్పంలో భాగంగా బైరవ వాహనంలో త్వరలోనే రాష్ట్ర వ్యాప్తంగా యాత్ర చేపడతామన్నారు. నిరుద్యోగులను మోసం చేసి కనీసం జాబ్ క్యాలెండర్ కూడా ప్రకటించని కాంగ్రెస్ కు గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో గట్టి బుద్ది చెప్పాలని కోరారు.

ప్రతిపక్షం బీఆర్ఎస్, బీజేపీ లు కాంగ్రెస్ ను ప్రశ్నించకుండా కాలం వెళ్లదీస్తున్నాయని మండిపడ్డారు. ప్రజల్లో చైతన్య శక్తి ని నింపేలా తాము కృషి చేస్తున్నామని గ్రాడ్యుయేట్ ఎన్నికల్లో తమ పార్టీ అభ్యర్థులకు ఓట్లు వేసి గెలిపించాలని కోరారు. ఇంటర్మీడియేట్ బోర్డును రద్దు చేయాలన్న ప్రభుత్వ నిర్ణయం సరికాదని..దానిపై మంగళవారం పార్టీ ఆధ్వర్యంలో రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించనున్నామని చెప్పారు.

Also Read : ఓపిక‌గా బ్యాటింగ్ చేయ‌డ‌మే ముఖ్యం: రవిశాస్త్రి

Follow Us On : WhatsApp

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>