కలం, స్పోర్ట్స్: న్యూజిలాండ్‌పై సిరీస్ గెలిచినా.. భారత బ్యాటింగ్‌పై ఆందోళన తప్పడం లేదు. నాలుగో వన్డేలో 89 పరుగులకే ఆలౌట్ కావడంపై కోచ్ గౌతమ్ గంభీర్ (Gautam Gambhir) వ్యక్తం చేసిన ఆందోళన సరైనదేనని మాజీ కోచ్ రవిశాస్త్రి (Ravi Shastri) అన్నారు. ఐదో వన్డే తర్వాత మాట్లాడిన ఆయన.. 2027 ప్రపంచకప్ జరిగే దక్షిణాఫ్రికా పరిస్థితులకు న్యూజిలాండ్ పిచ్‌లు దగ్గరగా ఉంటాయని గుర్తుచేశారు. ఇలాంటి పరిస్థితుల్లో భారత బ్యాటర్లు మరింత మెరుగ్గా ఆడాలని శాస్త్రి సూచించారు. ప్రతి మ్యాచ్‌లోనూ 300 నుంచి 320 పరుగులు చేయాలనే ఆలోచన అవసరం లేదన్నారు.
పిచ్ బౌలర్లకు అనుకూలంగా ఉన్నప్పుడు 260 నుంచి 270 పరుగులు కూడా గెలిపించే స్కోరుగా మారవచ్చని చెప్పారు. కఠినమైన పరిస్థితుల్లో వికెట్లు కాపాడుకుంటూ, ఓపికగా బ్యాటింగ్ చేయడం ముఖ్యమని పేర్కొన్నారు. ఐదో వన్డేలో భారత్ 209 పరుగులే చేసినా.. బౌలర్లు ఆ స్కోరును కాపాడి జట్టుకు విజయాన్ని అందించారు. అయితే ప్రపంచకప్‌ను దృష్టిలో పెట్టుకుని బ్యాటింగ్‌లో మరింత మెరుగుపడాల్సిన అవసరం ఉందని శాస్త్రి (Ravi Shastri) వ్యాఖ్యలు స్పష్టం చేస్తున్నాయి.
Also Read : వైభవ్.. సచిన్ అవుతాడా? కాంబ్లీ అవుతాడా?: కపిల్ దేవ్
Follow Us On : WhatsApp

