కలం, వెబ్ డెస్క్: తెలంగాణలో నీటి గోసపై అధికార కాంగ్రెస్, ప్రతిపక్ష బీఆర్ఎస్ పార్టీపై తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత (Kavitha) తీవ్ర స్థాయిలో ఫైర్ అయ్యారు. 12 ఏళ్లలో 2.20 లక్షల కోట్ల ఖర్చు పెట్టినా సాగునీరు అందక అన్నదాతలు అరిగోస పడుతున్నరని ఆవేదన వ్యక్తం చేశారు. రాష్ట్రంలో సాగునీటి ప్రాజెక్టుల కోసం రెండు పార్టీల ప్రభుత్వాలు రూ.లక్షలాది కోట్లు ఖర్చు చేసినా రైతులకు సాగు నీరు అందడం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎండల తీవ్రత పెరగడంతో బోర్లు, బావుల్లో నీళ్లు అడుగంటున్నాయని పేర్కొన్నారు.
రాష్ట్రవ్యాప్తంగా చేతికొచ్చే దశలో ఉన్న పంటను కాపాడుకోవడానికి రైతులు నానా తంటాలు పడుతున్నారని తెలిపారు. రంగారెడ్డి జిల్లా కుర్మిద్ద, నానక్ నగర్, మంతన్ గౌరెల్లి, నల్లవెల్లి తదితర గ్రామాల్లో చేతికొచ్చే దశలో ఉన్న పంటలను కాపాడుకోవడానికి రైతులు వాటర్ ట్యాంకర్లపై ఆధారపడుతున్నారని పేర్కొన్నారు. ఒక్కో ట్యాంకర్ కు రూ.వెయ్యికి పైగా చెల్లిస్తున్నారని.. వరి, కూరగాయల పంటలను రక్షించుకోవడానికి లక్షలాది రూపాయలు ఖర్చు చేస్తున్నారని చెప్పారు. ఒక మహిళా రైతు తన పంట చేతికి రావాలంటే నీళ్ల ట్యాంకర్లకే రూ.1.50 లక్షలు ఖర్చు చేయాల్సి వస్తుందని చెప్పడం బీఆర్ఎస్, కాంగ్రెస్ ప్రభుత్వాల దుబారా పనులకు అద్దం పడుతోందని కవిత (Kavitha) విమర్శించారు.
Read Also: తెలంగాణను వ్యతిరేకిస్తే.. మూల్యం చెల్లించాల్సిందేనా?
Follow Us On: WhatsApp

