కలం డెస్క్ : బీఆర్ఎస్ పార్టీలో పురుషాధిక్య భావజాలం ఉన్నదని, ఒక మహిళగా తన ఎదుగుదలను ఓర్వలేక సస్పెండ్ చేయడానికి అదే కారణమైందని కల్వకుంట్ల కవిత(Kavitha) ఆరోపించారు. బీఆర్ఎస్ అధికారంలో ఉన్నప్పుడు తన ఫోన్‌ను, తన భర్త ఫోన్‌ను, తన కుటుంబ సభ్యుల ఫోన్లు ట్యాపింగ్ అయ్యాయని మరోసారి వ్యాఖ్యానించారు. ఆ ప్రక్రియలో పాలుపంచుకున్నవారిలో చాలా నమ్మకమైన వ్యక్తే తనకు ఈ విషయాన్ని చెప్పారని ఆమె తాజాగా ఇచ్చిన ఇంటర్‌వ్యూలో పేర్కొన్నారు. కేటీఆర్ భార్య ఫోన్‌ను కూడా ఇదే తీరులో ట్యాపింగ్ చేసినట్లయితే ఆయన లైట్‌గా తీసుకునేవారా?.. ఊరుకునేవారా?.. అని ప్రశ్నించారు. తన ప్రతీ కదలికను గమనిస్తున్నట్లు, నిఘా నీడలో ఉన్నట్లు అర్థమైందని, ఆ అనుమానం వచ్చిన తర్వాత రూఢీ చేసుకునే ప్రయత్నంలోనే నమ్మకమైన వ్యక్తి నుంచి పాజిటివ్ సమాధానం వచ్చిందని గుర్తుచేశారు.
మహిళలకు రాజకీయ అవకాశాలు తక్కువే :
రాజకీయ పార్టీల్లో సాధారణంగా పురుషాధిక్యత ఉన్నట్లుగానే బీఆర్ఎస్‌లో సైతం ఉన్నదని కవిత(Kavitha) ఆరోపించారు. దేశంలో చాలామంది మహిళలు రాజకీయాల్లో రాణించినా వారు చాలా స్ట్రగుల్ చేయాల్సి వచ్చిందన్నారు. తాను సైతం కచ్చితంగ రాజకీయ పార్టీ పెడతానని, 2028లో లేదా 2029లో రానున్న అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేస్తానని అన్నారు. అప్పుడు జాగృతి వర్సెస్ బీఆర్ఎస్ అనే తరహా రాజకీయ పోటీ ఉంటుందన్నారు. జాగృతి వర్సెస్ కాంగ్రెస్ పోటీ కూడా ఉండొచ్చేమోనని అన్నారు. బీఆర్ఎస్ పార్టీ నుంచి తాను ఎదుర్కొన్న చేదు అనుభవానికి ఎన్నికల ద్వారానే తాను సమాధానం చెప్పాలనుకుంటున్నట్లు పేర్కొన్నారు.
Read Also: ‘గిఫ్ట్ సిటీ’లో ఇండియన్ ఏఐ రీసెర్చ్ .. దేశంలోనే ఫస్ట్ సెంటర్‌గా ఏర్పాటు
Follow Us On: Instagram


