కలం, వెబ్ డెస్క్ : రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ (Putin) నివాసంపై ఉక్రెయిన్ డ్రోన్లతో దాడి చేసిందని రష్యా ఆరోపించింది. ఈ ఘటనపై భారత ప్రధాని నరేంద్ర మోడీ (PM Modi) తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు. ఈ దాడిని ఖండిస్తున్నట్టు ప్రకటించారు. శాంతి కోసం డిప్లమాటిక్ ప్రయత్నాలు మాత్రమే సరైన మార్గమని, అన్ని పక్షాలు ఆ ప్రయత్నాలపై దృష్టి సారించాలని, అవి దెబ్బతినే చర్యలకు దూరంగా ఉండాలని మోడీ సూచించారు.
రష్యా(Russia) కథనం ప్రకారం.. ఉక్రెయిన్ డ్రోన్లు పుతిన్ నివాసం ఉన్న ప్రాంతమైన క్రినిట్సా, జాన్‌హాట్ ప్రాంతాలపై దాడి చేశాయి. ఇది బ్లాక్ సీ తీరంలోని గెలెండ్‌జిక్ సమీపంలో ఉంది, ఇక్కడ పుతిన్ భారీ ప్యాలెస్ ఉందని తెలుస్తున్నది. రష్యా ఈ దాడిని ఉక్రెయిన్ చేసిందని ఆరోపిస్తూ, ప్రతీకారం తీర్చుకుంటామని హెచ్చరించింది. అయితే ఉక్రెయిన్ ఈ ఆరోపణలను తోసిపుచ్చింది. ఇది పూర్తిగా కల్పితమని, ఉక్రెయిన్‌పై మరిన్ని దాడులకు అవకాశంగా రష్యా ఇలాంటి కథలు సృష్టిస్తోందని ఉక్రెయిన్ అధ్యక్షుడు వోలోడిమిర్ జెలెన్‌స్కీ అన్నారు.
రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ (Putin) నివాసంపై జరిగిన డ్రోన్ దాడి (Drone Attack) ఆరోపణలపై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తన వివరణ ఇచ్చారు. పుతిన్‌తో ఫోన్ సంభాషణలో ఈ విషయాన్ని చర్చించిన ట్రంప్.. ‘నేను దీనిపై చాలా కోపంగా ఉన్నాను. ఇది మంచిది కాదు’ అని అన్నారు. ఈ ఘటన శాంతి చర్చలపై ప్రభావం చూపుతుందని పుతిన్ ట్రంప్‌కు చెప్పారు. ‘ఈ ఘటనకు సంబంధించి రష్యా ఎలాంటి ఆధారాలు అందించలేదు. అమెరికా ఇంటెలిజెన్స్ ఏజెన్సీలు దీనిపై మరిన్ని వివరాలు తెలుసుకుంటాయి’ అని ట్రంప్ చెప్పారు.
మోడీ ఎక్స్ (ట్విట్టర్)లో స్పందిస్తూ.. రష్యా అధ్యక్షుడి నివాసం లక్ష్యంగా చేసుకుని దాడి చేసినట్లు వచ్చిన నివేదికలపై తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు. ‘శాంతి కోసం డిప్లమాటిక్ ప్రయత్నాలు మాత్రమే సరైన మార్గం. అన్ని పక్షాలు ఆ ప్రయత్నాలపై దృష్టి పెట్టాలి, అవి దెబ్బతినే చర్యలకు దూరంగా ఉండాలి’ అని రాశారు.
Read Also: ఫారెస్ట్ లో రాహుల్ ఫ్యామిలీ న్యూ ఇయర్ వేడుకలు
Follow Us On: Pinterest


