మాజీ మంత్రి, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌పై తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కవిత(Kavitha) డైరెక్ట్ అటాక్ చేశారు. బీఆర్ఎస్‌తో విభేదాలతో బయటకు వచ్చిన ఆమె.. కేటీఆర్ పేరు పెట్టి విమర్శలు చేయడం ఇదే తొలిసారి. బీఆర్ఎస్(BRS) సోషల్ మీడియాలోనే ఉంటుందని, అందుకే జూబ్లీలో ఓడిపోయిందని ఆమె విమర్శించారు. ఇప్పటికి అయినా కేటీఆర్(KTR) సోషల్ మీడియాలో ఉండడం కాకుండా ప్రజల్లోకి రావాలని ఆయనకు సూచించారు.
‘‘బీఆర్ఎస్ కేడర్ వేలమంది మాతో టచ్‌లో ఉన్నారు. బీఆర్ఎస్ నేతలు జగదీశ్ రెడ్డి, మదన్ రెడ్డి, ప్రశాతం రెడ్డి, నిరంజన్ రెడ్డి గతంలో ఎలా ఉండేవారు. ఇప్పుడు వందల కోట్ల రూపాయలు వారికి ఎలా వచ్చాయి? మేమే ప్రధాన ప్రతిపక్షంగా పనిచేస్తున్నాం. బీఆర్ఎస్ నేతలు ఆస్తులు పెంచుకున్నారు కానీ కేడర్‌ను మాత్రం పట్టించుకోలేదు. బీఆర్ఎస్ అధినేత కేసీఆర్(KCR) స్ఫూర్తితోనే మేము ప్రజల కోసం పనిచేస్తున్నాం’’ అని అన్నారు.
కేటీఆర్, హరీష్(Harish Rao)లు పేరుకు కృష్ణార్జులని ట్వీట్ చేసుకోవడం తప్ప.. క్షేత్రస్థాయిలో పనిచేయట్లేదు. 15 మంది ఇండిపెండెంట్లు నా దగ్గరకి వచ్చారు. తాము నామినేషన్ ఉపసంహరించుకుంటున్నామని, ఎవరికి మద్దతు ఇవ్వమంటారని అడిగారు. కానీ నేను.. జూబ్లీ ఉపఎన్నిక(Jubilee Hills bypoll)కు నాకు సంబంధం లేదని చెప్పాను. ఆ తర్వాత వాళ్లు హరీష్ దగ్గరకు వెళ్లి అదే అడిగారు. ఆయన కూడా అదే మాట అన్నారట. నేను బీఆర్ఎస్‌లో లేను కాబట్టి.. ఉపఎన్నికకు దూరంగా ఉన్నాను. కానీ హరీష్ రావు ఆ పార్టీలో ఉన్నారు కదా.. పార్టీలోనే ఉంటూ ఆయన మోసం చేశారు’’ అని ఆమె(Kavitha) విమర్శించారు.
Read Also: బీహార్ ఎలక్షన్స్.. 50వేల ఓట్ల తేడాతో యూట్యూబర్ ఓటమి
Follow Us on: Youtube

