epaper
Tuesday, November 18, 2025
epaper

బీహార్ ఎలక్షన్స్.. 50వేల ఓట్ల తేడాతో యూట్యూబర్ ఓటమి

బీహార్ ఎన్నికల్లో యూట్యూబర్ మనీష్ కశ్యప్‌(Manish Kashyap)కు ఓటర్లు భారీ షాక్ ఇచ్చారు. అతనికి యూట్యూబ్‌లో 90లక్షల మంది సబ్‌స్క్రైబర్‌లు ఉన్నారు. కానీ ఎన్నికలో 50వేల ఓట్ల తేడాతో చిత్తయ్యాడు. చన్‌పటియా నియోజకవర్గంలో జనసురాజ్‌ తరఫున బరిలో దిగిన ఆయనకు 50 వేలకుపైగా ఓట్ల తేడాతో పరాజయం ఎదురైంది. సోషల్‌ మీడియాలో విస్తృత ప్రజాదరణ, దాదాపు 96 లక్షల మంది ఫాలోవర్లు ఉన్నప్పటికీ అనుభవజ్ఞులైన రాజకీయ నాయకులను ఎదుర్కొనేందులో ఆయనకు విజయం లభించలేదు.

చన్‌పటియాలో కాంగ్రెస్‌ అభ్యర్థి అభిషేక్‌ రంజన్‌ భాజపా నాయకుడు ఉమాకాంత్‌ సింగ్‌పై 37 వేల ఓట్ల ఆధిక్యంతో గెలుపొందగా, అదే నియోజకవర్గంలో పోటీ చేసిన 34 ఏళ్ల యూట్యూబర్‌ మనీశ్‌ కశ్యప్‌(Manish Kashyap)కు గణనీయమైన ఓటమి సంభవించింది. బిహార్‌కు చెందిన మనీశ్‌ యూట్యూబ్‌ వీడియోల ద్వారా ప్రజాదరణ పొందారు. ముఖ్యంగా 2023లో తమిళనాడు వలస కూలీలపై దాడులు జరిగినట్లు పేర్కొంటూ రూపొందించిన వీడియోల కారణంగా ఆయన ఎక్కువగా వార్తల్లో నిలిచారు.

Read Also: సైబర్ క్రైమ్స్ తో పోలీసుల పరేషాన్

Follow Us on : ShareChat

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>