Mobile Popup Ad
Mobile Popup Ad

అధికారంలోకి వచ్చాక ‘పాంచజన్యం’ అమలు చేస్తాం: కవిత

కలం, వెబ్ డెస్క్: తెలంగాణలో తెలంగాణ రక్షణ సేన (TRS) అధికారంలోకి వచ్చాక తామిచ్చిన పాంచజన్యం హామీలను అమలు చేస్తామని ఆ పార్టీ చీఫ్ కల్వకుంట్ల కవిత (Kalvakuntla Kavitha) స్పష్టం చేశారు. మేడ్చల్-మల్కాజిగిరి జిల్లా కుత్బుల్లాపూర్ నియోజకవర్గం నుండి టీఆర్ఎస్ పార్టీలోకి భారీగా చేరికలు జరిగాయి. జెండా పండుగ ప్రారంభోత్సవంలో భాగంగా పార్టీ జండాను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా కవిత మాట్లాడుతూ.. వచ్చే నెల లోపు విద్యార్థులకు ఫీజు నియంత్రణ చట్టం చేయాలని డిమాండ్ చేశారు.

జూన్ 2 లోగా ఉద్యమకారులకు, అమరుల కుటుంబాలకు ఇచ్చిన హామీలు నెరవేర్చాలని.. లేదంటే ప్రభుత్వంపై ఉద్యమం తప్పదని కవిత హెచ్చరించారు. రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవంలోగా కుత్బుల్లాపూర్ నియోజకవర్గంలోని అమరుల స్థూపాన్ని ఆవిష్కరించాలని.. లేదంటే టీఆర్ఎస్ ఆధ్వర్యంలో తామే స్థూపాన్ని ఆవిష్కరిస్తామని చెప్పారు. కుత్బుల్లాపూర్ నియోజకవర్గంలో తెలంగాణ అమరుల స్థూపం నిర్మించి 20 ఏళ్లు అవుతోందని కవిత చెప్పారు. ఇప్పటి వరకు కూడా ఆ స్థూపాన్ని ఆవిష్కరించకపోవటం బాధాకరమని అన్నారు.

తెలంగాణ ఉద్యమ పార్టీ అని చెప్పుకునే వాళ్లను గెలిపించినప్పటికీ అమరుల స్థూపంపై నిర్లక్ష్యం వహించారని కవిత ఆగ్రహం వ్యక్తం చేశారు. కుత్బుల్లాపూర్ లో నేడు పార్టీ జెండాను ఎగురవేసుకున్నామని.. ఈ నియోజకవర్గం నుంచే తమ ఎమ్మెల్యే ల కౌంట్ ప్రారంభమవుతుందని చెప్పారు. రానున్న ఎన్నికల్లో కచ్చితంగా కుత్బుల్లాపూర్ నియోజకవర్గం ఎమ్మెల్యే టీఆర్ఎస్ పార్టీ నుంచే ఎన్నికవుతారని ఆశాభావం వ్యక్తం చేశారు. జీహెచ్ఎంసీ ఎన్నికల్లో కూడా అన్ని డివిజన్లలో తమ పార్టీ అభ్యర్థులను నిలబెడతామని ప్రకటించారు. తెలంగాణ ప్రజల హక్కుల పరిరక్షణ కోసం పుట్టిందే తెలంగాణ రక్షణ సేన పార్టీ అని వ్యాఖ్యానించారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>