జూబ్లీహిల్స్(Jubilee Hills) ఉపఎన్నిక ఫలితాలపై తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కవిత(Kavitha) సంచలన పోస్ట్ పెట్టారు. ఎన్నికల ఫలితాలు వెలువడిన కొద్దిసేపటికే ఆమె తన ఎక్స్(ట్విట్టర్) ఖాతాలో.. ‘కర్మ హిట్స్ బ్యాక్’ అంటూ చేసిన పోస్ట్ ప్రస్తుతం రాష్ట్రవ్యాప్తంగా తీవ్ర దుమారం రేపుతోంది. శుక్రవారం వెలువడిన జూబ్లీహిల్స్ ఉపఎన్నిక ఫలితాల్లో కాంగ్రెస్ ఘన విజయం సాధించింది. 24,729 ఓట్ల మెజార్టీతో నవీన్ యాదవ్ గెలిచారు. ఇందులో బీఆర్ఎస్ ఓడిపోయింది.
ఈ సమయంలో కవిత(Kavitha) చేసిన ట్వీట్.. తీవ్ర చర్చలకు దారితీసింది. కొంతకాలంగా కవితకు, బీఆర్ఎస్‌కు మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమనే పరిస్థితులు ఉన్నాయి. ఇప్పుడు కవిత పెట్టిన పోస్ట్ దానిని వాస్తవం చేసింది. బీఆర్ఎస్ ఓడిపోయిన సమయంలో ‘కర్మ హిట్స్ బ్యాక్’ అని కవిత ఎవరిని టార్గెట్ చేస్తూ పోస్ట్ పెట్టారు? అన్న చర్చ మొదలైంది. కొందరు కేటీఆర్‌ను టార్గెట్ చేశారంటే, మరింకొందరు మాత్రం బీఆర్ఎస్ మొత్తాన్ని అన్నారని అంటున్నారు.

Read Also: ‘జూబ్లీ’ గెలుపుతో రేవంత్ స్ట్రాంగ్
Follow Us on: Instagram

