epaper
Monday, November 17, 2025
epaper

‘జూబ్లీ’ గెలుపుతో రేవంత్ స్ట్రాంగ్

కలం డెస్క్ : జూబ్లీహిల్స్ అసెంబ్లీ ఉప ఎన్నికలో కాంగ్రెస్ ఘన విజయంతో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి(Revanth Reddy) వ్యూహం, కృషి ఫలించినట్లయింది. ఒక్కో డివిజన్‌కు ఇద్దరు మంత్రుల చొప్పున బాధ్యతలు అప్పజెప్పడం, ఆరు రోజుల పాటు స్వయంగా ముఖ్యమంత్రే ఆ నియోజకవర్గంలోని అన్ని డివిజన్లలో ప్రచారం చేయడం, రోడ్ షో లు నిర్వహించడం, స్ట్రీట్ కార్నర్ మీటింగుల్లో పాల్గొనడం.. ఇవన్నీ ఆశించిన ఫలితాలు ఇచ్చాయి. టీమ్ వర్క్, గెలిచి తీరాలన్న ఆకాంక్షకు అనుగుణంగా పార్టీ వ్యవహారాల రాష్ట్ర ఇన్‌చార్జి మీనాక్షి నటరాజన్, రాష్ట్ర పీసీసీ చీఫ్ మహేశ్ కుమార్ గౌడ్, రాష్ట్రానికి ప్రతినిధులుగా ఉన్న ఏఐసీసీ బాధ్యులతో లోతుగా చర్చించి పటిష్ట వ్యూహాన్ని రూపొందించడం గమనార్హం.

బలపడుతున్న కాంగ్రెస్, Revanth Reddy :

జూబ్లీ హిల్స్ ఉప ఎన్నికలో(Jubilee Hills Bypoll) కాంగ్రెస్ గెలుపుతో రాజకీయంగా అన్ని పార్టీలకూ స్పష్టమైన మెసేజ్ ఇచ్చినట్లయింది. గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో 2023 అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ నామమాత్రపు ప్రభావాన్నే చూపించగలింది. జిల్లాల్లో కనిపించిన విజయాలు జీహెచ్ఎంసీ పరిధిలో రాబట్టలేకపోయింది. తొలుత సికింద్రాబాద్ కంటోన్మెంట్‌ అసెంబ్లీ స్థానానికి జరిగిన ఉప ఎన్నికలో బీఆర్ఎస్ సిట్టింగ్ స్థానాన్ని గల్లంతు చేసి కైవశం చేసుకున్న కాంగ్రెస్… దానికి కొనసాగింపుగా ఇప్పుడు జూబ్లీహిల్స్ స్థానాన్నీ గెలుచుకున్నది. ఆ ప్రకారం బీఆర్ఎస్ బలాన్ని రెండు స్థానాల్లో తగ్గించగలిగింది. కాంగ్రెస్ పార్టీ బలాన్ని పెంచడంతో పాటు గతంలో పీసీసీ చీఫ్‌గా ఇప్పుడు ముఖ్యమంత్రిగా రేవంత్‌రెడ్డి తన స్థానాన్ని కూడా స్ట్రాంగ్ చేసుకున్నారు.

విపక్షాల విమర్శలు బేఖాతర్ :

గతంలో ఎన్నడూ ఏ ముఖ్యమంత్రీ ఉప ఎన్నికల్లో గల్లీల్లో తిరగలేదని, ఇంతటి విస్తృతంగా ప్రచారం చేయలేదని సీఎం రేవంత్‌రెడ్డిని వేలెత్తి చూపుతూ బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఘాటుగా విమర్శలు చేశారు. దీనికి దీటుగానే బదులిచ్చిన సీఎం రేవంత్.. ప్రతీ ఉప ఎన్నికనూ తాను ప్రతిష్టాత్మకంగా తీసుకుంటానని, గతంలో హుజూరాబాద్, హుజూర్‌నగర్, నాగార్జునసాగర్ ఉప ఎన్నికల్లోనూ ఇదే స్థాయిలో ప్రచారం చేశానని స్పష్టం చేశారు. పోటీలో ఉన్న అభ్యర్థి ఎవరైనా స్వయంగా తానే పోటీ చేస్తున్నాననే స్పిరిట్‌తో ప్రచారం చేస్తానని క్లారిటీ ఇచ్చారు. విపక్షాల విమర్శలను లెక్క చేయకుండా జూబ్లీహిల్స్ నియోజకవర్గంలోని అన్ని డివిజన్లలో విస్తృతంగా ప్రచారం చేశారు. కాంగ్రెస్‌ను గెలిపించాల్సిన అవసరాన్ని నొక్కిచెప్పడంతో పాటు తమ పార్టీ అభ్యర్థి గెలిస్తే ఆ ప్రాంత అభివృద్ధి ఏ స్థాయిలో ఉంటుందో వివరించారు.

Read Also: పవన్ కల్యాణ్‌లా చిరాగ్ పాశ్వాన్ .. స్ట్రైక్ రేట్ 100 శాతం !

Follow Us on : Pinterest

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>