గవర్నర్‌తో కవిత భేటీ.. సమస్యలపై వినతిపత్రం అందజేత

కలం, వెబ్ డెస్క్: హైదరాబాద్‌లోని లోక్ భవన్‌లో గవర్నర్ శివప్రతాప్ శుక్లా‌ను తెలంగాణ రక్షణ సేన (TRS) అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత (Kavitha) మర్యాదపూర్వకంగా కలిశారు. గవర్నకు కవిత శాలువా కప్పి సన్మానం చేశారు. కవిత వెంట ధర్మ సమాజ్ పార్టీ అధ్యక్షుడు విశారదన్ మహారాజ్ ఉన్నారు. ఈ సందర్భంగా వెలుగుమట్ల, కడ్లాపూర్, ట్రిపుల్ ఆర్ బాధితులతో కలిసి గవర్నర్ (Shiv Pratap Shukla)తో కవిత సమావేశమై పలు అంశాలపై చర్చించారు. వెలుగుమట్లలో ఇండ్లు కోల్పోయిన బాధితులందరికీ ఇంటి స్థలాలు కేటాయించాలని, పరిగి మండలం కడ్లాపూర్‌లో ఇండస్ట్రియల్ పార్క్ ఏర్పాటుకు జారీ చేసిన భూసేకరణ నోటీసులను రద్దు చేయాలని, హైదరాబాద్ చుట్టూ నిర్మితమౌతున్న రిజనర్ రింగ్ రోడ్ (RRR) అలైన్‌మెంట్ మార్పు, భూసేకరణ సమస్యలపై బాధితులతో కలిసి వినతిపత్రం అందజేశారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>