కలం, వెబ్‌డెస్క్: ఎండ తీవ్రత పెరిగే కొద్దీ ఒంటి వేడి, చెమటకాయలు, చర్మంపై దురదలు వంటి సమస్యలు ప్రతి ఒక్కరినీ వేధిస్తుంటాయి. ఇలాంటి సమయంలో రసాయనాలతో కూడిన పౌడర్లు, క్రీములు వాడటం కంటే.. ప్రకృతి సిద్ధంగా దొరికే సాంప్రదాయ వనమూలికలను ఆశ్రయించడం ఎంతో సురక్షితం. అటువంటి వాటిలో మన పూర్వీకుల కాలం నాటి ‘సోమిడి చెక్క’ (Somidi Chekka) అగ్రస్థానంలో నిలుస్తుంది. వేసవి తాపాన్ని అణిచివేసి, చర్మానికి చల్లదనాన్ని ఇవ్వడంలో సోమి వృక్షం బెరడు అద్భుతంగా పనిచేస్తుందని సూచిస్తున్నారు నిపుణులు. ముఖ్యంగా ఎండలకు నల్లగా మారిన చర్మానికి ఇది సంజీవనిలా పనిచేస్తుంది.
సోమిడి చెక్కను ఉపయోగించే విధానం
ఒక చెంచా సోమిడి చెక్క పొడిలో, కొద్దిగా శనగపిండి, పసుపు, పాలు కలిపి పేస్ట్ చేసి ఒంటికి నలుగు పెట్టుకుంటే.. చర్మంపై పేరుకుపోయిన మురికి, ట్యాన్ సులువుగా వదిలిపోతాయని సూచిస్తున్నారు నిపుణులు. వేడికి వచ్చే దురద, చెమటకాయలు తగ్గుతాయట. రెండు మూడు సోమిడి చెక్కలను నీళ్లలో వేసి రంగు మారే వరకు మరిగించి, ఆ నీటిని స్నానం చేసే నీళ్లలో కలుపుకోవాలి. దీనివల్ల శరీరం చల్లబడటమే కాదు, మనసూ సేదతీరుతుంది. చర్మం మృదువుగా, ఆరోగ్యంగా మారుతుంది. దీనిలోని యాంటీ బ్యాక్టీరియల్ గుణాలు మొటిమల వాపునీ, మచ్చల్నీ తగ్గిస్తాయి. ఇదంతా పూర్తిగా సహజమైనదే అయినప్పటికీ, ముఖానికి రాసుకునే ముందు ఒక

