Mobile Popup Ad
Mobile Popup Ad

క‌విత‌కు గుడ్‌న్యూస్.. పేరు మార్పుతో టీఆర్ఎస్ పార్టీకి ఈసీ ఆమోదం

క‌లం, వెబ్‌డెస్క్‌: Kavitha TRS | తెలంగాణ రాజ‌కీయాల్లో మ‌రో కీల‌క ప‌రిణామం చోటు చేసుకుంది. క‌ల్వ‌కుంట్ల క‌విత స్థాపించిన రాజ‌కీయ పార్టీకి కేంద్ర ఎన్నిక‌ల సంఘం ఆమోద ముద్ర వేసింది. ఈ నెల 25న క‌విత మేడ్చ‌ల్‌లోని అద్వ‌య క‌న్వెన్ష‌న్‌లో త‌న పార్టీ పేరును తెలంగాణ రాష్ట్ర సేన‌గా ప్ర‌క‌టించింది. అంత‌కు ముందే క‌విత పార్టీ గుర్తింపు కోసం ఈసీకి ద‌ర‌ఖాస్తు చేసుకున్నారు. ఆ దరఖాస్తులో తెలంగాణ రాష్ట్ర సేన పేరుతోపాటు తెలంగాణ రక్షణ సేన అనే ఆప్షన్ ని కూడా ఇచ్చారు. వివరాలన్నింటినీ స్క్రూటినీ చేసిన ఎన్నికల సంఘం అధికారులు తెలంగాణ రక్షణ సేన అనే పేరుకే ఆమోదం తెలిపారు.

ఈ మేర‌కు పార్టీ రిజిస్ట్రేష‌న్‌కు సంబంధించిన అధికారిక ప‌త్రాల‌ను GHMC అధికారులు బంజారాహిల్స్ లోని క‌విత నివాసానికి చేరుకొని ఆమెకు అంద‌జేశారు. దీంతో క‌విత టీఆర్ఎస్ (Kavitha TRS) పేరుతో తెలంగాణ‌లో తెలంగాణ రక్షణ సేన పార్టీ రూపంలో రాజ‌కీయ ప్ర‌స్థానాన్ని ప్రారంభించ‌నున్నారు.

Read Also: ఫలితాలు కాదు.. పిల్లల ప్రాణాలే ముఖ్యం: గరికిపాటి

Follow Us On: Sharechat

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>