కలం, జోగులాంబ గద్వాల: ఎలాంటి అనుమతులు లేకుండా అక్రమంగా తరలిస్తున్న ఇసుక ట్రాక్టర్‌ను గురువారం కేటిదొడ్డి పోలీసులు (KT Doddi Police) పట్టుకుని కేసు నమోదు చేసినట్లు ఎస్ఐ శ్రీనివాసులు తెలిపారు. రాయచూర్ జిల్లా గాజులపాడు నుంచి ధరూర్ మండలం అల్వాల్ పాడు గ్రామానికి ఇసుక తరలిస్తున్న క్రమంలో పోలీసులు మైలగడ్డ స్టేజ్ సమీపంలో ఇసుక ట్రాక్టర్‌ను స్వాధీనం చేసుకుని, ట్రాక్టర్ డ్రైవర్ విజయ్, ఓనర్ జంగిలప్పపై కేసు నమోదు చేశారు.

