Mobile Popup Ad
Mobile Popup Ad

బండి సంజయ్‌ను మంత్రివర్గం నుండి తొలగించాలి: కవిత

కలం, వెబ్ డెస్క్: కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్‌ను మంత్రివర్గం నుండి తొలగించాలని టీఆర్ఎస్ పార్టీ అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత (Kavitha) డిమాండ్ చేశారు. ఆయన కుమారుడి మీద నమోదైన పోక్సో (POCSO) కేసులో విచారణ పారదర్శకంగా జరగాలంటే ఆయన పదవిలో ఉండొద్దని పేర్కొన్నారు. ఈ మేరకు బండి భగీరథ్ మీద నమోదైన పోక్సో (POCSO) కేసులో విచారణ పారదర్శకంగా జరగాలంటే ఆయనను మంత్రి వర్గం నుంచి తొలగించాలంటూ ప్రధాని మోడీకి కవిత లేఖ రాశారు. ఈ కేసు విచారణ పారదర్శకంగా జరగాలంటే బండి సంజయ్ పదవిలో ఉండకూడదని లేఖలో పేర్కొన్నారు. ఈ కేసులో ఎలాంటి రాజకీయ ఒత్తిళ్లు లేకుండా స్వతంత్ర విచారణ జరిగేందుకు ప్రధాని చొరవ చూపాలని కోరారు.

దేశంలో మైనర్ల రక్షణ కన్నా రాజకీయ ప్రయోజనాలు ఎక్కువ కాదని ప్రధాని గుర్తించాలని కవిత లేఖలో పేర్కొన్నారు. బాధితురాలికి పూర్తి న్యాయం జరగాలన్నా, ప్రజాస్వామ్య వ్యవస్థల పట్ల ప్రజల్లో నమ్మకం కలగాలన్న విచారణలో ఎలాంటి రాజకీయ జోక్యం ఉండొద్దని రాసుకొచ్చారు. రాజ్యాంగ నిబద్ధతను, నైతిక విలువలను కాపాడటం ప్రధానిగా తమ తక్షణ కర్తవ్యమని.. దీనిని గుర్తించాలని పేర్కొన్నారు. ఈ కేసు విచారణ పూర్తయ్యే వరకు బండి సంజయ్ ను మంత్రివర్గం నుంచి తప్పించాలని లేఖలో కోరారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>