కలం, వెబ్ డెస్క్: పోక్సో కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న బండి భగీరథ్ (Bandi Bhagirath) పోలీసుల ఎదుట లొంగిపోయాడు. మైనర్ బాలికను లైంగికంగా వేధించిన కేసులో నిందితుడిగా ఉన్న ఆయన శనివారం పోలీసుల ముందుకు లొంగిపోయాడు. లాయర్ల సమక్షంలో సరెండర్ ప్రక్రియ జరిగింది. ఈ కేసు తీవ్రతను పరిగణనలోకి తీసుకున్న మేడ్చల్ కోర్టు, ఇప్పటికే బాధితురాలి నుంచి కీలకమైన స్టేట్‌మెంట్‌ను రికార్డు చేసింది. భగీరథ్ సరెండర్‌తో ఈ కేసు విచారణ మరింత వేగవంతం కానుంది.

