epaper
Thursday, January 15, 2026
spot_img
epaper

కవిత అరెస్ట్ : నవ్వుకుంటున్న కేటీఆర్, హరీష్‌

కలం, వెబ్ డెస్క్ : తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు, ఎమ్మెల్సీ కవిత (Kavitha) అరెస్ట్ పై వచ్చిన ఓ పోస్టు ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. క్రిషాంక్ అనే బీఆర్ ఎస్ మద్దతుదారు చేసిన ట్వీట్ కు కవిత టీమ్ ఇచ్చిన ఆన్సర్ సంచలనంగా మారింది. తాజాగా క్రిషాంక్ కవిత అరెస్ట్ అయినప్పుడు కేటీఆర్ ఎంతగా కష్టపడ్డాడో చెబుతూ ఓ పోస్టు పెట్టాడు. కవితను అరెస్ట్ చేయడానికి వచ్చినప్పుడు కేటీఆర్ మహబూబ్ నగర్ లో ర్యాలీ ఆపేసి మరీ వెంటనే సుప్రీంకోర్టు లాయర్లతో జూమ్ కాల్ మాట్లాడాడు అని తెలిపాడు. అంత చేస్తే తాను అరెస్ట్ అయినప్పుడు కేటీఆర్ కనీసం ఫైట్ చేయలేదని కవిత  చెప్పడం కరెక్ట్ కాదంటూ పోస్టులో రాసుకొచ్చాడు. అలాగే మరో పోస్టులో ఈడీ అధికారులు కేటీఆర్ తమతో వాగ్వాదానికి దిగాడు అంటూ నోటీసులు ఇచ్చారని తెలిపాడు.

ఈ పోస్టులకు కవితక్క అప్డేట్స్ పేరుతో ఉన్న హ్యాండిల్ నుంచి రిప్లై వచ్చింది. కవిత(Kavitha) టీమ్ ఇందులో స్ట్రాంగ్ గా రియాక్ట్ అయింది. సొంత చెల్లెలు అరెస్ట్ అయితే కేటీఆర్, హరీష్‌ రావు నవ్వుతున్నారు అంటూ ఓ వీడియోను పంచుకున్నారు కవిత టీమ్. కవిత అరెస్ట్ అయి కారులో ఎక్కుతున్న టైమ్ లో పక్కనే నిలబడ్డ కేటీఆర్, హరీష్‌ ఇలా నవ్వుతారా అంటూ అందులో రాసుకొచ్చారు. ‘హరీష్‌ రావు అంటే కుట్రపూరితంగా నవ్వుతున్నాడని అనుకోవచ్చు గానీ.. నువ్వు ఎందుకు నవ్వుతున్నావ్ కేటీఆర్’ అంటూ అందులో ప్రశ్నించారు. సీఎం కుర్చీకి అడ్డు రావొద్దనే ఉద్దేశంతోనే ఇలా అరెస్ట్ చేయించలేదని ప్రస్తుతానికి తాము నమ్ముతున్నామని.. అది నిజమో కాదో త్వరలోనే తేలిపోతుందని చెప్పారు. ఈ పోస్టు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

Read Also: ఢిల్లీ కాలుష్యంపై ఎన్​హెచ్​ఏఐకి సుప్రీం నోటీసులు

Follow Us On: Instagram

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>