Mobile Popup Ad
Mobile Popup Ad

ఈనెల 25న కొత్త రాజకీయ శక్తిగా వస్తున్నాం: కవిత

కలం, వెబ్ డెస్క్: జగిత్యాల బీఆర్ఎస్ సభలో కేంద్ర ప్రభుత్వాన్ని కేసీఆర్ (KCR) పల్లెత్తి మాట కూడా అనలేదని తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత (Kavitha) ఫైర్ అయ్యారు. తెలంగాణ ఉద్యమ కారుల గురించి బీఆర్ఎస్ ఎక్కడ కూడా మాట్లాడటం లేదని దుయ్యబట్టారు. రేపటి ఆర్టీసీ జేఏసీ సమ్మెకు తెలంగాణ జాగృతి నుంచి సంపూర్ణ మద్దతు ఉంటుందని ప్రకటించారు. ఆర్టీసీని ప్రవేట్ పరం చేసే కుట్ర చేస్తున్నారని ఆరోపించారు. హైదరాబాద్ లోని బంజారాహిల్స్ తెలంగాణ జాగృతి కార్యాలయం నుంచి ప్రెస్ మీట్ నిర్వహించి మాట్లాడారు. ఈనెల 25న కొత్త రాజకీయ శక్తిగా వస్తున్నామని.. రాష్ట్రం నలువైపుల నుంచి ప్రజలు తరలిరావాలని పిలుపునిచ్చారు. సిరిసిల్ల జిల్లా నుంచి పాదయాత్రగా పార్టీ ఆవిర్భావ కార్యక్రమనికి వస్తున్నారని చెప్పారు. కొత్త రాజకీయ పరిణామం జరుగబోతోంది కాబట్టి.. పబ్లిసిటి మెటీరియల్ డిస్ట్రబ్ చేయొద్దని జీహెచ్ఎమ్ సీ అధికారులను కోరుతున్నట్లు తెలిపారు.

వైఎస్ రాజశేఖర్ రెడ్డి ఉంటే తనకు తెలంగాణ గూర్చి ఎందుకు? అని ఆనాడు జీవన్ రెడ్డి (Jeevan Reddy) అన్నారని గుర్తు చేశారు. జీవన్ రెడ్డి పచ్చి తెలంగాణ వ్యతిరేకి అని మండిపడ్డారు. గుంట నక్క డిల్లీ వెళ్తే ముఖ్యమంత్రి డీల్ కుదుర్చుకొని వస్తున్నట్లు చెబుతున్నారని ఆరోపించారు. ఎవరు ప్రతి పక్షంలో, ఎవరు అధికారంలో ఉండాలనేది చెప్పడానికి సీఎం రేవంత్ రెడ్డి ఎవరు? అని ప్రశ్నించారు. వచ్చే పదేళ్లలో ఎవరు అధికారంలో ఉంటారో మీరు ఎలా చెబుతారు? దీనిపై ప్రజలే తీర్పునివ్వాలి అని చురకలు అంటించారు. రాష్ట్రంలో రైతుల పరిస్థితి బాగాలేదని.. జిల్లాల్లో మక్కలు కొనే దిక్కు లేదని ఆమె (Kavitha) ఆగ్రహం వ్యక్తం చేశారు.

 Read Also: ఉద్యోగుల బదిలీలపై తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం

Follow Us On: Pinterest

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>