Mobile Popup Ad
Mobile Popup Ad

పాత చింతకాయ పచ్చడిలా.. కేసీఆర్ ప్రసంగం: ఎమ్మెల్యే వేముల

కలం, నల్లగొండ బ్యూరో: బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ నిన్నటి బహిరంగసభపై నకిరేకల్ ఎమ్మెల్యే వేముల వీరేశం (Vemula Veeresham) తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. కేసీఆర్ ప్రసంగంలో ఏమాత్రం పస లేదని, అది కొండంత రాగం తీసి ఏదో పాట పాడినట్లుగా ఉందని ఆయన ఎద్దేవా చేశారు. కేసీఆర్ మాటల్లో వాస్తవికత లోపించిందని, అన్నీ పాత విషయాలనే వల్లెవేస్తూ పాత చింతకాయ పచ్చడిలా తన ప్రసంగాన్ని కొనసాగించారని విమర్శించారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని బద్నాం చేసేందుకే కేసీఆర్ కొన్ని పదాలను సృష్టించుకుని మాట్లాడుతున్నారని, ఆయన నిండు నూరేళ్లు ప్రతిపక్ష నాయకుడిగానే ఉండాలని వీరేశం ఆకాంక్షించారు.

తెలంగాణ ఉద్యమం గురించి పాత కథలు చెబుతూ కాలక్షేపం చేస్తున్నారని, అలిశెట్టి ప్రభాకర్ (Alishetty Prabhakar) వ్యాఖ్యలను వాడుకోవడం ద్వారా ఆయన ఆత్మ ఘోషించేలా కేసీఆర్ ప్రవర్తిస్తున్నారని మండిపడ్డారు. పార్టీలో అవమానాల గురించి కేసీఆర్ మాట్లాడటం హాస్యాస్పదమని, బీఆర్ఎస్ పార్టీలో జరిగిన అవమానాల గురించి చెప్పుకుంటే అది మహాభారతం అంత అవుతుందని ఆయన వ్యాఖ్యానించారు. నాడు తన తమ్ముడిలా భావించిన ఈటల రాజేందర్‌కు, చెల్లెమ్మ అని పిలుచుకున్న విజయశాంతికి కేసీఆర్ ఇచ్చిన గౌరవం ఏపాటిదో తెలంగాణ సమాజం అంతా చూసిందని గుర్తు చేశారు. నాగం జనార్ధన్ రెడ్డితో పాటు అన్న అని పిలిచిన నాయిని నర్సింహారెడ్డి వంటి నేతలను ఏ రకంగా అవమానించారో అందరికీ తెలుసని పేర్కొన్నారు.

ఉద్యమంలో సర్వం కోల్పోయిన వారిని కనీసం పలకరించని కేసీఆర్, ఈ రోజు ఆత్మగౌరవం గురించి నీతులు చెప్పడం విడ్డూరంగా ఉందని వీరేశం (Vemula Veeresham) విమర్శించారు. తెలంగాణను నిండు వడ్డించిన విస్తరిలా, నిండు ఖజానాతో రేవంత్ రెడ్డి చేతుల్లో పెట్టానని కేసీఆర్ గుండె మీద చేయి వేసుకుని చెప్పగలరా అని ఆయన సవాల్ విసిరారు. గత పదేళ్లలో రాష్ట్రం ఏమైందో అందరికీ తెలుసన్నారు. మాజీ డిప్యూటీ సీఎం రాజయ్యను ఏ కారణంతో పదవి నుంచి తొలగించారో ఇప్పటికీ సమాధానం లేదని, మనుషుల విలువ తెలియని కేసీఆర్ ఈ రోజు ప్రేమలు, అభిమానాల గురించి మాట్లాడటం వింతగా ఉందని ఎద్దేవా చేశారు. కేసీఆర్ సమాజానికి ఏం సందేశం ఇవ్వాలనుకుంటున్నారో స్పష్టం చేయాలని వేముల వీరేశం ప్రశ్నించారు.

 Read Also: ఉద్యోగుల బదిలీలపై తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం

Follow Us On: X(Twitter)

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>