కలం, వెబ్ డెస్క్ : పశ్చిమాసియాలో నెలకున్న ఉద్రిక్తత భారత్ పై తీవ్ర ప్రభావం చూపుతోంది. ముఖ్యంగా వంట గ్యాస్ ఎల్పీజీ కొరత ఏర్పడుతోంది. కమర్షియల్ సిలిండర్ల సరఫరా తగ్గిపోయి దేశంలోని చాలా హోటళ్లు మూతబడుతున్నాయి. దీంతో రెస్టారెంట్లు, హోటళ్ల యజమానులు ప్రత్యామ్నాయాలపై దృష్టి పెడుతున్నారు. ఈ నేపథ్యంలో కరీంనగర్ కు చెందిన వెల్డర్ రుక్మంగదార్ హోటల్ యజమాని ఎదుర్కొంటున్న ఎల్పీజీ సిలిండర్ల కొరతకు పరిష్కారం కనుగొన్నాడు. రెండు రోజుల్లో ఒక డీజిల్ స్టవ్ (Diesel Stove) తయారు చేసి వావ్ అనిపించుకున్నాడు.
ఈ స్టవ్ డీజిల్ తో నడుస్తుంది. చిన్న కంటైనర్, బ్లోయర్ ఉపయోగించి దీన్ని తయారు చేశారు. కంటైన్ లో ఉన్న డీజిల్ బొట్టు బొట్టు పైపు ద్వారా పడుతూ బర్నర్ కు అందుతుంది. బ్లోయర్ ఈ మంటను పెంచుతుంది. డీజిల్ స్టవ్ (Diesel Stove) ను తయారు చేయడానికి రూ. 4,500 మాత్రమే ఖర్చు అయినట్లు తెలుస్తోంది. దీంతో ఎల్పీజీ గ్యాస్ లేకుండానే వంట చేసుకునేందుకు అవకాశం ఉంది. కొత్త ఐడియాకు సంబంధించిన వీడియో సామాజిక మాధ్యమాల్లో తెగ వైరలవుతోంది. డీజిల్ పొగ వల్ల ఆహారం కలుషితం అవుతుందని, డీజిల్ వాసన వచ్చే అవకాశాలు ఉన్నాయని నెటిజన్లు కామెంట్స్ పెడుతున్నారు. మరికొందరు ఇలాంటివి ఇంతకముందే ఉన్నాయని చెబుతున్నారు.
-కరీంనగర్ వెల్డర్.. సిలిండర్ల చెక్ పెట్టేందుకు సరికొత్త ఐడియా
-డీజిల్‌తో వెలిగే ‘స్టవ్’ తయారు చేసిన వెల్డర్
-ఆటో ట్యాంక్, వాటర్ ట్యాప్‌తో ‘డీజిల్ స్టవ్’ తయారీ
Karimnagar Welder’s Innovation: New Stove Runs on Diesel to Beat LPG Shortage#Karimnagar #DieselStove #WelderRukku… pic.twitter.com/a1A2ACevUl— Kalam Daily (@kalamtelugu) April 14, 2026
Read Also: గ్యాస్ లేకుండా వంట చేసుకోవచ్చు.. సరికొత్త స్టవ్
Follow Us On: Instagram

