చీరలో డాన్స్ చేస్తే తప్పా..? యువతి కన్నీరు !

కలం, వెబ్​ డెస్క్​ : గుజరాత్​ రాష్ట్రం వడోదర (Vadodara)లోని ప్రఖ్యాత ఎంఎస్ యూనివర్సిటీ (MS University) వేదికగా జరిగిన ఒక నృత్య ప్రదర్శన ఇప్పుడు తీవ్ర దుమారానికి దారితీసింది. ABVP ఆధ్వర్యంలో నిర్వహించిన ‘సంస్కార్ సంగమం’ కార్యక్రమంలో ఒక విద్యార్థిని చీర కట్టుకుని ‘ధక్ ధక్’ పాటకు డ్యాన్స్ చేయడం రాజకీయ రంగు పులుముకుంది. ఈ ప్రదర్శనపై NSUI, కాంగ్రెస్ నేతలు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. విద్యాసంస్థల్లో ఇలాంటి ప్రదర్శనలు అశ్లీలతను ప్రోత్సహించేలా ఉన్నాయని వారు విమర్శించడంతో ఈ అంశం కాస్తా వివాదాస్పదంగా మారింది.

ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ కావడంతో సదరు విద్యార్థినిపై నెటిజన్లు పెద్ద ఎత్తున ట్రోలింగ్‌కు దిగారు. ఈ పరిణామాలతో తీవ్ర మనస్తాపానికి గురైన ఆ యువతి కన్నీటి పర్యంతమవుతూ సోషల్ మీడియా వేదికగా స్పందించింది. భారతీయ సంప్రదాయ వస్త్రమైన చీర కట్టుకుని నృత్యం చేయడంలో అశ్లీలత ఎక్కడ ఉందో చెప్పాలని ఆమె ప్రశ్నించింది. తన కళను ప్రదర్శించినందుకు ఇంతలా కించపరచడం తగదని ఆవేదన వ్యక్తం చేసింది. ప్రస్తుతం ఈ ఘటనపై నెటిజన్ల మధ్య భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఒక వర్గం ఆమెకు అండగా నిలుస్తుండగా, మరికొందరు విమర్శలు కొనసాగిస్తూనే ఉన్నారు.

Read Also: పెళ్లికి సిద్ధమవుతున్నారా.. వెయిట్ లాస్ ఇంజెక్షన్ల జోలికి వెళ్లకండి!

Follow Us On: Pinterest

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>