Mobile Popup Ad
Mobile Popup Ad

కరీంనగర్ రైల్వే ప్రయాణికులకు అలర్ట్: పలు రైళ్లు రద్దు

కలం, కరీంనగర్ బ్యూరో : కరీంనగర్ (Karimnagar) జిల్లా రైల్వే ప్రయాణికులకు అధికారులు కీలక ప్రకటన చేశారు. కరీంనగర్ రైల్వే స్టేషన్ కేంద్రంగా నడిచే పలు రైళ్లను రైల్వే అధికారులు తాత్కాలికంగా రద్దు చేశారు. ఈ నెల మే 23, 24, 25, 30, 31 తేదీలతో పాటు, వచ్చే నెల జూన్ 1వ తేదీన కూడా పలు సర్వీసులు అందుబాటులో ఉండవని అధికారులు ప్రకటించారు.

రద్దయిన రైళ్ల వివరాలు..

సిర్పూర్ – కరీంనగర్, కరీంనగర్ – సిర్పూర్ (ట్రైన్ నెంబర్స్: 67771, 67772) సర్వీసులు ఉన్నాయి. అలాగే కరీంనగర్ – బోధన్, బోధన్ – కరీంనగర్ (ట్రైన్ నెంబర్స్: 67773, 87774) రైళ్లు పైన పేర్కొన్న తేదీల్లో పూర్తిగా రద్దు చేయబడ్డాయి.

వీటితో పాటు, ఈ నెల 24 , 31వ తేదీల్లో (ఆదివారాలు) కాచిగూడ – కరీంనగర్, కరీంనగర్ – కాచిగూడ (ట్రైన్ నెంబర్స్ – 77649, 77650) రైళ్లు కూడా రద్దు చేసినట్లు అధికారులు వెల్లడించారు. రైల్వే శాఖ విడుదల చేసిన ఒక ప్రకటనలో ఈ వివరాలను అధికారికంగా ధృవీకరించింది. ప్రయాణికులు ఈ మార్పులను గమనించి, తమ ప్రయాణాలను తదనుగుణంగా ప్లాన్ చేసుకోవాలని అధికారులు కోరుతున్నారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>