కరీంనగర్ పోలీస్ వెల్ఫేర్ అసోసియేషన్ నూతన కార్యవర్గం ఎన్నిక

కలం, కరీంనగర్: కరీంనగర్ కమిషనరేట్ పరిధిలోని (Karimnagar Police) పోలీస్ వెల్ఫేర్ అసోసియేషన్‌కు నూతన కార్యవర్గం ఎన్నికైంది. మొత్తం 34 మంది ప్రతినిధుల నుంచి 13 మంది కార్యవర్గ సభ్యులుగా ఎన్నికయ్యారు. నూతన కార్యవర్గంలో ప్రెసిడెంట్‌గా ఏ. సతీష్, పీసీ ఎన్నికయ్యారు. వైస్ ప్రెసిడెంట్లుగా బి. శ్రీనివాస్ (సిఐ), బి. వంశీకృష్ణ, (ఎస్ఐ) ఎన్నికయ్యారు.సెక్రటరీగా సీహెచ్. నర్సింహారావు, ఎస్‌ఐ, జాయింట్ సెక్రటరీగా ఏ. శ్రీనివాస్, హెడ్ కానిస్టేబుల్, ఆర్గనైజింగ్ సెక్రటరీగా జె. ఓదయ్య, పీసీ, ట్రెజరర్‌గా ఆర్. చంద్ర మౌళి, పీసీ ఎన్నికయ్యారు.

యూనిట్ ఎగ్జిక్యూటివ్ కమిటీ సభ్యులుగా ఎం. ప్రవీణ్ రెడ్డి (ARPC ), వి. మల్లేశం (ARHC ), బి. శ్రీధర్ (PC ), ఏ. తిరుపతి (PC), కె. మహేష్ (PC ), వి. శైలజ (WPC ) ఎన్నికయ్యారు. ఈ మేరకు వారు సీపీ గౌష్ ఆలంను మర్యాదపూర్వకంగా కలుసుకున్నారు. ఈ సందర్భంగా సీపీ వారికి శుభాకాంక్షలు తెలియజేశారు. నూతన కార్యవర్గం పోలీసు సిబ్బంది సంక్షేమం, వారి సమస్యల పరిష్కారం, సంక్షేమ కార్యక్రమాల అమలు కోసం సమన్వయంతో పనిచేయాలని సూచించారు. నూతన కార్యవర్గ సభ్యులు మాట్లాడుతూ.. పోలీసు సిబ్బంది సంక్షేమానికి ప్రాధాన్యతనిస్తూ, వారి సమస్యలను సంబంధిత అధికారుల దృష్టికి తీసుకెళ్లి పరిష్కారానికి కృషి చేస్తామని తెలిపారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>