కలం, కరీంనగర్ బ్యూరో: తెలంగాణ మల్టీజోన్-1 ఐజీపీ చంద్రశేఖర్ రెడ్డి (IGP Chandrasekhar Reddy) ఈరోజు కరీంనగర్ (Karimnagar)లో పీఎంజే జ్యువెలరీ దోపిడీ ఘటన జరిగిన ప్రాంతంలో పర్యటించారు. ముందుగా ఆయన క్రైమ్ సీన్‌ను క్షుణ్ణంగా పరిశీలించి, దర్యాప్తు పురోగతిపై అధికారులకు కీలక ఆదేశాలు జారీ చేశారు. అనంతరం, ఐజీపీ స్థానిక ఆసుపత్రిని సందర్శించి, ఈ ఘటనలో గాయపడి చికిత్స పొందుతున్న బాధితులను పరామర్శించారు. వారి ఆరోగ్య పరిస్థితి గురించి వైద్యులను అడిగి తెలుసుకున్నారు. బాధితులకు మెరుగైన వైద్యం అందించాలని సూచిస్తూ, వారికి న్యాయం జరుగుతుందని భరోసా ఇచ్చారు. ఈ పర్యటనలో ఆయన వెంట కరీంనగర్ సీపీ గౌష్ ఆలం పలువురు పోలీస్ ఉన్నతాధికారులు ఉన్నారు.
Read Also: కరీంనగర్ దోపిడీ ఘటన.. గాయపడిన వారు సేఫ్
Follow Us On: X(Twitter)

