ప్రజావాణి దరఖాస్తులు త్వరితగతిన పరిష్కారం : కమిషనర్ ప్రఫుల్ దేశాయ్

కలం, కరీంనగర్ బ్యూరో : ప్రజావాణికి వచ్చిన దరఖాస్తులను ప్రాధాన్యతగా పరిష్కరిస్తున్నామని కరీంనగర్ (Karimnagar) మున్సిపల్ కమీషనర్ ప్రఫుల్ దేశాయ్ (Praful Desai) తెలిపారు. సోమవారం నగరపాలక సంస్థ ఆవరణలోని కళాభారతి భవనంలో నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమంలో కమీషనర్ ప్రఫుల్ దేశాయ్, డిప్యూటీ కమీషనర్ ఖాధర్ మొహియుద్దీన్‌తో  పాటు పలు విభాగాల అధికారులు పాల్గొన్నారు.

ఈ కార్యక్రమంలో ప్రజల నుండి ఫిర్యాదులు, వినతులను స్వీకరించారు. మొత్తం 20 దరఖాస్తులు అందగా, వాటిలో ఇంజనీరింగ్ విభాగానికి 9, టౌన్ ప్లానింగ్‌కు 6, రెవెన్యూ విభాగానికి 2, సానిటేషన్‌కు 1, ఇందిరమ్మ పథకానికి 2 దరఖాస్తులు వచ్చినట్లు అధికారులు తెలిపారు. దరఖాస్తుల పరిష్కారం విషయంలో ఎటువంటి పెండింగ్ లేకుండా, విభాగాల వారీగా త్వరితగతిన చర్యలు తీసుకోవాలని కమీషనర్ అధికారులను ఆదేశించారు.

Read Also: కేరళంలో యూడీఎఫ్ విజయం.. రాహుల్ ఏమన్నారంటే!

Follow Us On: Instagram

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>