కలం, కరీంనగర్ బ్యూరో : గ్లోబల్ సిటీగా కరీంనగర్ వేగంగా అడుగులు వేస్తోంది.. ఇది తెలంగాణకే గర్వకారణం అని నగర మేయర్ కొలగాని శ్రీనివాస్ (Mayor Kolagani Srinivas) అన్నారు. ఉత్తరాఖండ్ రిషికేష్ లో జరిగిన ఆల్ ఇండియా కౌన్సిల్ ఆఫ్ మేయర్స్ 117వ సమావేశంలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా మేయర్ ప్రసంగింస్తూ.. స్మార్ట్ సిటీ అంటే కేవలం సాంకేతికత మాత్రమే కాదు, ప్రజల జీవితాలను సులభతరం చేయడం అని తెలిపారు.
కరీంనగర్ వేగంగా అభివృద్ధి చెందుతున్న నగరమని.. ఆధునిక నగరంగా మార్చడానికి అనేక పెద్ద మార్పులు జరుగుతున్నాయన్నారు. స్వచ్ఛమైన నీరు, మంచి డ్రైనేజీ వ్యవస్థ, మెరుగైన రోడ్లు, అందమైన పార్కులను నిర్మించి ప్రజలకు ఒక మెరుగైన వాతావరణాన్ని అందించే ప్రయత్నం చేస్తున్నట్లు వివరించారు. తెలంగాణ రాష్ట్రం ఆవిర్భావించిన అనంతరం ప్రధమంగా కరీంనగర్ మున్సిపల్ కార్పొరేషన్ ను బిజెపి కైవసం చేసుకుందని కొలగాని శ్రీనివాస్ (Mayor Kolagani Srinivas) వివరించారు.
Read Also: బైకర్లకు ఎయిర్ బ్యాగ్.. కరీంనగర్ విద్యార్థికి జాతీయ గుర్తింపు
Follow Us On: Sharechat

