నగరాన్ని సమాంతరంగా అభివృద్ధి చేస్తాం: మేయర్ కొలగాని శ్రీనివాస్.

కలం, కరీంనగర్ బ్యూరో : కరీంనగర్ నగర అభివృద్ధిపై మేయర్ కొలగాని శ్రీనివాస్ (Kolagani Srinivas) కీలక వ్యాఖ్యలు చేశారు. నగరాన్ని అన్ని రంగాల్లో సమాంతరంగా అభివృద్ధి చేస్తామని ఆయన స్పష్టం చేశారు. శుక్రవారం నగరంలోని 3వ డివిజన్‌లో పర్యటించిన మేయర్, విద్యారణ్యపురిలో సీసీ రోడ్డు నిర్మాణ పనులకు శ్రీకారం చుట్టారు. స్థానిక కార్పోరేటర్ సాదవేణి లావణ్య మునింధర్, సుడా చైర్మన్ నరేందర్ రెడ్డితో కలిసి సుమారు 8.70 లక్షల రూపాయలతో చేపట్టనున్న ఈ పనులకు భూమి పూజ నిర్వహించారు.

ఈ సందర్భంగా మేయర్ (Kolagani Srinivas) మాట్లాడుతూ.. నగర సమగ్ర అభివృద్ధే తమ పాలకవర్గ లక్ష్యమని తెలిపారు. విలీన గ్రామాలు, శివారు ప్రాంతాలను ప్రత్యేకంగా అభివృద్ధి చేసి నగరంతో సమానంగా తీర్చిదిద్దుతామని చెప్పారు. కాలనీలలో అంతర్గత రోడ్లు, డ్రైనేజీ వ్యవస్థలను మెరుగుపరచి ప్రజలకు మెరుగైన మౌలిక సదుపాయాలు అందిస్తామని హామీ ఇచ్చారు. సీసీ రోడ్డు పనులను నాణ్యత ప్రమాణాలతో, నిర్ణీత గడువులో పూర్తి చేయాలని ఇంజనీరింగ్ అధికారులకు, కాంట్రాక్టర్‌కు మేయర్ ఆదేశాలు జారీ చేశారు. ఈ పనుల ప్రారంభంతో స్థానిక ప్రజలు హర్షం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో కార్పోరేటర్ గాజ రమా శివరాం, ఈఈ శివానందం, ఏఈ గఫూర్ తదితరులు పాల్గొన్నారు.

Read Also: నేపాల్ ప్రధాని సంచలనం.. ప్రోటోకాల్ పక్కనపెట్టి ప్రజా క్షేత్రంలోకి!

Follow Us On: X(Twitter)

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>