కలం, కరీంనగర్ బ్యూరో: పెళ్లికి… చావుకి ఓకే వాయిద్యం వాయిస్తున్నట్లుగా బీఆర్ఎస్ పార్టీ నాయకుల పరిస్థితి ఉందని భారతీయ జనతా పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి, డిప్యూటీ మేయర్ యాదగిరి సునీల్ రావు (Sunil Rao) మండి పడ్డారు. కరీంనగర్ లో ఇటీవల జరిగిన దోపిడి విషయంలో కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి బండి సంజయ్ పై బీఆర్ఎస్ నాయకులు చేసిన అనుచిత వాఖ్యలను ఖండిస్తూ… ఫైర్ అయ్యారు. నగరంలోని ఓ ప్రైవేటు ఫంక్షన్ హాల్ లో వీలేకరుల సమావేశంలో యాదగిరి సునీల్ రావు మాట్లాడుతూ… శాంతి భద్రతలు ఎవరి చేతులో ఉంటాయో అనే విషయం పది సంవత్సరాలు అధికారంలో ఉన్న బీఆర్ఎస్ పార్టీ నాయకులకు తెలియకపోవడం సిగ్గుచేటని ద్వజ మెత్తారు. ఎక్కడైన అవాంఛనీయ ఘటనలు జరిగితే బాధ్యతయుతమైన రాజకీయ నాయకులుగా ఖండిచాల్సింది పోయి… బండి సంజయ్ కుమార్ సీఎం రేవంత్ రెడ్డితో ములాకత్ అయ్యారని… దోపిడి జరిగితే ఏం చేస్తున్నారనే స్థాయికి బీఆర్ఎస్ నాయకులు దిగాజారడం సిగ్గుచేటని ద్వజ మెత్తారు.
బీఆర్ఎస్ పార్టీ నాయకులు ఇంతటి దీన స్థితికి దిగజారడం చాలా దురదృష్టకరం అన్నారు. బీఆర్ఎస్ పార్టీ శాసనసభ్యులు గంగుల కమలాకర్, పాడి కౌశిక్ రెడ్డి, ఇతర శాసన సభ్యులు బండి సంజయ్ కుమార్ పై చేస్తున్న విమర్శలు వారి సిగ్గులేని తనానికి నిదర్శనం అని నిప్పులు చెరిగారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని ప్రతి అంశంలో నిలదీస్తూ….తప్పిదాలను ఎత్తి చూపి విమర్శలు చేస్తున్న నాయకులు కేవలం బండి సంజయ్ మాత్రమే అన్నారు. ఈ విషయాన్ని చూడకుండా… పరిశీలించకుండా…. కళ్ళుండి చూడలేని కబోదుల్లా బీఆర్ఎస్ పార్టీ నాయకులు తయారయ్యారని ఎద్దేవ చేశారు. కాంగ్రెస్ పార్టీ అధిష్టానం కు రేవంత్ రెడ్డి మూటలు అప్పగిస్తున్నారని బండి సంజయ్ ప్రతి రోజు మాట్లాడుతున్నారని స్పష్టం చేశారు.
వండ్ల కొనుగోళ్ళులో జాప్యం, రైతు బరోసా ఎగవేత విషయాల్లో అధికార కాంగ్రెస్ పార్టీ వ్యవహారిస్తున్న తీరు పట్ల బండి సంజయ్ ప్రతి రోజు నిలదీస్తున్నారని అన్నారు. బీఆర్ఎస్ పార్టీ నాయకులు ఇవన్ని చూస్తూ… గమనిస్తూ… ఏం ఎరగనట్లు మాట్లాడటం శోచనీయమని మండి పడ్డారు. అధికారం ఉంటే… కరీంనగర్ కు లేకుంటే హైదరాబాద్ కు అంకితమై రాజకీయ పబ్బం గడుపుకునే నాయకులు గంగుల కమలాకర్ లాంటి నాయకులని నిప్పులు చెరిగారు. బండి సంజయ్ కుమార్ పై ఎవరైనా చౌక భారు విమర్శలు చేస్తే…. తప్పకుండ తగిన రీతిలో స్పందిస్తామని హెచ్చరించారు.
కౌశిర్ రెడ్డి చేసిన సవాల్ కు మేము సిద్దంగా ఉన్నామని…బండి సంజయ్ కుమార్ విషయంలో ఎక్కడికంటే అక్కడికి ఏ చర్చకంటే ఆ చర్చకు మేం సిద్దమని సవాల్ విసిరారు. కేటీఆర్ తరుపున కౌశిక్ రెడ్డి సిద్దమా? అని సవాల్ విసిరారు. కౌశిక్ రెడ్డికి… కాంగ్రెస్ పార్టీ కి, రేవంత్ రెడ్డి కి ఉన్న సంబంధాలు రాష్ట్ర ప్రజలందరికి తెలుసని ఎద్దేవా చేశారు. కౌశిక్ రెడ్డి నోరు జాగ్రత్తగా పెట్టుకోని మాట్లాడలని హెచ్చరించారు. మీరు చేస్తున్న వాఖ్యలను రాష్ట్ర ప్రజలంతా చూస్తున్నారని మండి పడ్డారు. తెలంగాణ రాష్ట్ర లో భారత జనతా పార్టీ అధికారంలోకి వస్తుందనే అక్కసుతో… కళ్ళు బైర్లు కమ్మి ఇష్టం వచ్చినట్లు వాఖ్యలు చేస్తున్నారని ద్వజ మెత్తారు.
కేటీఆర్ డ్రగ్ పరిక్షలకు వస్తారని సవాల్ చేస్తున్నారు… మేం కూడా సవాల్ చేస్తున్నాం… బండి సంజయ్ గారు వారి కుటుంబ సభ్యులతో సహా ఎక్కడికంటే అక్కడికి డ్రగ్ పరిక్షలకు వస్తామని సిద్దంగా ఉన్నామని సవాల్ విసిరారు. మీ కేటీఆర్ మీరు సిద్దామా…? అని ప్రశ్నించారు. కౌశిక్ రెడ్డికి మెదడు తలలో కాదని మోకాళ్లలో ఉందని ఎద్దేవా చేశారు. కౌశిక్ రెడ్డి చేష్టలు, మాటలు అదే స్థాయిలో ఉందని మండి పడ్డారు. బండి సంజయ్ కుమార్ కరీంనగర్ అభివృద్ధి కి ఏం తీసుకవచ్చారని వాఖ్యలు చేస్తున్నారు… మీరు పది సంవత్సరాలు అధికారంలో ఉండి ఏం చేశారని ప్రశ్నించారు.
డంపుయార్డు ను చూస్తే కనిపించడం లేదా…? గంగుల కమలాకర్ ఏం చేశారన్నది. స్మార్ట్ సిటీ లో నిధులు తెచ్చి కరీంనగర్ ను అభివృద్ధి చేసింది కేంద్ర మంత్రి బండి సంజయ్ కుమార్ అని అన్నారు. భారతీయ జనతా పార్టీ నాయకులు రేవంత్ రెడ్డి తో కాదు ఎవ్వరితో కుమ్మక్కు కారని అలాంటి ఆలోచన బీజేపి నాయకులకు రాదని ద్వజ మెత్తారు. గత రెండు సంవత్సరాలుగా కార్యకర్తలను మభ్యపెట్టి రాజకీయం పబ్బం గడుపుకునేది గంగుల కాదా…? అని ప్రశ్నించారు. బీఆర్ఎస్ పార్టీ లో ఏ విధంగా మంత్రి అయ్యారో అందరికి తెలుసని అన్నారు. నేటికి కార్యకర్తలను మభ్య పెడుతూ… రాజకీయం పబ్బం గడుపుకునేది గంగుల కమలాకర్ అని నిప్పులు చెరిగారు. బండి సంజయ్ పై ఒక్క మాట జారీనా… ఊరుకునేది లేదని హెచ్చరించారు. బండి సంజయ్ కుమార్ నాయకత్వాన్ని చూసి కరీంనగర్ లో ప్రజలు పట్టం కట్టారని స్పష్టం చేశారు. ఈ మీడియా సమావేశంలో 24వ డివిజన్ కార్పొరేటర్ ఒంటెల సత్యనారాయణ రెడ్డి గారు,10వ డివిజన్ కార్పొరేటర్ సాగాని కొమురయ్య గారు,43వ డివిజన్ కార్పొరేటర్ పొన్నం మొండయ్య-లక్ష్మి గారు,మాజీ కార్పొరేటర్ చంద్రమౌళి,బీజేపీ నాయకులు పండుగ నాగరాజు పాల్గొన్నారు.

