కలం, మెదక్ బ్యూరో : సంగారెడ్డి జిల్లా పటాన్ చెరులోని చెరువులను సంరక్షిస్తామని, చెరువుల పరిశుభ్రత మెరుగుపడటం కోసం శరవేగంగా గుర్రపుడెక్క తొలగింపు పనులను చేపడుతున్నట్లు ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి (MLA Gudem Mahipal Reddy) తెలిపారు. పటాన్ చెరు జీహెచ్ఎంసీ డివిజన్ పరిధిలోని సాకి చెరువులో 70 లక్షల రూపాయల అంచనా వ్యయంతో చేపట్టనున్న గుర్రపు డెక్క తొలగింపు పనులను ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మహిపాల్ రెడ్డి మాట్లాడుతూ, వర్షాకాలం ప్రారంభమయ్యేలోపు చెరువులలో గుర్రపు డెక్క తొలగింపు పనులు పూర్తి కావాలని అధికారులను ఆదేశించారు.
డివిజన్ పరిధిలోని తిమ్మక్క చెరువు, జేపీ కాలనీ డివిజన్ పరిధిలోని దోషం చెరువులలోను ఒక కోటి రూపాయల అంచనా వ్యయంతో అతి త్వరలో గుర్రపు డెక్క తొలగింపు పనులను ప్రారంభించనున్నట్లు ఎమ్మెల్యే (MLA Gudem Mahipal Reddy) తెలిపారు. గుర్రపు డెక్క తొలగించడం వలన చెరువు నీటి సామర్థ్యం పెరగడంతో పాటు చెరువుల పరిశుభ్రత మెరుగుపడటంతో పాటు భూగర్భ జలాలు మట్టం పెరుగుతాయని తెలిపారు. ఈ కార్యక్రమంలో మాజీ కార్పొరేటర్లు మెట్టు కుమార్ యాదవ్, సపాన దేవ్, మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ విజయ్ కుమార్ పాల్గొన్నారు.

